Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

69వ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్‌ పరేడ్‌లో ఏడుగురు తెలుగువాళ్లు...

ఆదివారం, 29 అక్టోబరు 2017 (10:57 IST)

Widgets Magazine
ips service

హైదరాబాద్ వేదికగా 69వ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ జరగనుంది. సోమవారం జరిగే ఈ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 136 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 
 
హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ నెల 30న జరిగే… ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 69వ బ్యాచ్‌కు చెందిన 136 మంది ఐపీఎస్‌లు దీక్షాంత్ పరేడ్‌తో పాసింగ్ ఔట్ అవుతారు. వీరిలో 21 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ఈ బ్యాచ్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
 
69వ బ్యాచ్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు ఐపీఎస్‌లతో పాటు కర్ణాటక, మహారాష్ట్రతో కలిపి మొత్తం భారతీయులు 122 మంది ఉన్నారు. వీరితో పాటు నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందినవాళ్లు 14 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రతీ బ్యాచ్‌క 45 వారాల ట్రైనింగ్ ఉంటుంది. అందులో ఇండోర్, ఔట్ డోర్‌తో పాటు సైబర్ క్రైమ్ నేరాలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్, ఉగ్రదాడుల్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబూ... ఇక ఇక్కడ చాలు... ఇదిగో నా రాజీనామా... రేవంత్ రెడ్డి

గత కొన్ని రోజులుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తీవ్రస్థాయి చర్చకు తెరలేపిన రేవంత్ రెడ్డి ...

news

ఆ వేలి ముద్ర జయలలితతే .. హైకోర్టులో ప్రభుత్వ వైద్యుడు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్న సమయంలో అన్నాడీఎంకే బీఫామ్ పత్రాలపై వేసిన ...

news

అత్యాచారాన్ని చిత్రీకరించి షేర్ చేయడం దారుణం... నన్నపనేని

మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ...

news

నారాయణ విద్యా సంస్థలు వర్సెస్ చైతన్య విద్యా సంస్థలు, కలిసి పనిచేయలేం...

తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కళాశాలలు కొట్టుకుంటున్నాయా అంటే అవుననే అనాల్సి వస్తోంది. ...

Widgets Magazine