శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (09:59 IST)

కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశా.. టీడీపీలో నేను వలసపక్షిని...

సంచలన కామెంట్స్ చేయడంలోనూ, వివాదాల్లో చిక్కుకోవడంలోనూ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉన్నాయి. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజక

సంచలన కామెంట్స్ చేయడంలోనూ, వివాదాల్లో చిక్కుకోవడంలోనూ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉన్నాయి. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశాననీ, ఇపుడు టీడీపీలో తాను వలస పక్షిని అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అనంతపురం జిల్లా గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ యార్డు ఛైర్మెన్‌తో పాటు ఇక్కడున్నవారంతా ఒకే పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారని, తాను మాత్రమే వలస పక్షిని అని వ్యాఖ్యానించారు. 
 
పైగా టీడీపీలో చేరినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు కిరీటమేమీ పెట్టలేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశాననే బాధ ఉందన్నారు. ఇకపోతే.. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, కానీ, ఆలోగా అది పూర్తి కాదన్నారు.