శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (18:01 IST)

చంద్రబాబు ఓ చేతకాని దద్దమ్మ : జగదీష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఓ చేతకాని దద్దమ్మ అని విమర్శించారు. ప్రజల్ని మోసం చేయడం ఎలాగో బాబుకే తెలుసని అన్న ఆయన, ఎన్నికలు ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను మోసం చేయడానికే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారని ఆరోపించారు. 
 
పూర్తిగా రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు డ్వాక్రా రుణాలపై కూడా షరతులు పెడుతున్నారని జగదీశ్ ఆరోపించారు. చంద్రబాబుకు చెప్పింది చేయకపోవడం.. చేసేది చెప్పకపోవడం అలవాటేనని విమర్శించారు. తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా వారి జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. 
 
ఓ వైపు తెలంగాణలోని లక్షలాది గిరిజనులను ముంచుతూ.. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కూడా ప్రయోజనమని చంద్రబాబు చెబుతున్నారని, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వల్ల కూడా తెలంగాణకు ప్రయోజనం ఉంటుందని బాబు చెప్పగలరని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.