మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (09:19 IST)

ప్రజాగ్రహాన్ని చూసి చంద్రబాబు తలొగ్గారు.. సంతోషమే: జగన్

కేంద్రంతో కటీఫ్ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. కానీ ప్రజాగ్రహాన్ని చూశాకే చంద్రబాబు ఈ నిర్ణయానికి తలొగ్గార

కేంద్రంతో కటీఫ్ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. కానీ ప్రజాగ్రహాన్ని చూశాకే చంద్రబాబు ఈ నిర్ణయానికి తలొగ్గారని.. సంతోషకరమేనని జగన్ మీడియాతో అన్నారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతోనే కేంద్రం నుంచి బాబు వైదొలగాలనుకున్నారని..  రాజీనామాలకు ముందు ఆ విషయాన్ని కేంద్రానికి తెలియబరచడం ఎందుకని జగన్ ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలతో ఫోనులో మాట్లాడాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందని అడిగారు.
 
రాజీనామాలకు తెరలేపిన చంద్రబాబు ఇంకా ఎన్డీయే కన్వీనర్‌గా ఎందుకు కొనసాగుతున్నారని జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. పూటకో మాట, రోజుకో పాట పాడుతూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన మాట ఎప్పటికీ మార్చలేదని.. ఆయన మొదటి నుంచి ఒకటే చెప్తున్నారని.. కానీ జైట్లీ మాటలపై నాడు ఒకలా, నేడు మరోలా చంద్రబాబు స్పందించారని జగన్ ఫైర్ అయ్యారు.