శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (09:38 IST)

కేంద్ర ప్రభుత్వంపై 21న అవిశ్వాసం.. బాబు సహకరించాలి: జగన్

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదాకు సమానమైన నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో.. విభజన చట్టంలో వున్న హామీల

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదాకు సమానమైన నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో.. విభజన చట్టంలో వున్న హామీలను తప్పక ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీంతో ఎన్డీయే సర్కారుకు చుక్కలు చూపించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సన్నద్ధమయ్యారు. 
 
మరోవైపు ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంపై తన వంతు ఒత్తిడి తెచ్చేందుకు సై అంటున్నారు. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాసం పెట్టేందుకు తాను నిర్ణయించామని.. అవిశ్వాసానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకరించాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోరారు. చంద్రబాబు బాగా ఆలోచించుకునేందుకు ఈ నెల 21వ తేదీ వరకు సమయం ఇచ్చామని జగన్ వ్యాఖ్యానించారు.
 
రాష్ట్రం మొత్తం ఒకే తాటిపై నిలబడి 25 మంది ఎంపీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలిస్తే.. కేంద్రానికి తప్పకుండా ఓ సంకేతం వెళ్తుందని జగన్ అన్నారు. లేదంటే అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు పెడితే తాము మూకుమ్మడిగా మద్దతిస్తామని.. ఆపై 25మంది ఎంపీలతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తే.. కేంద్రం దిగివస్తుందని జగన్ మీడియా ముందు గురువారం తెలిపారు. చంద్రబాబు ఈ సలహాపై ఆలోచించాలని జగన్ కోరారు.