Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమో? జగన్ ప్రశ్న

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (13:41 IST)

Widgets Magazine
jagan

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్దఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారనీ, వారు ఎలా చెబితే అలా తలాడిస్తున్నారని జగన్ విమర్శించారు. తెలంగాణ రాదు అని చెప్పినప్పటికీ అక్కడి యువత అంతా ఒకతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారనీ, అలాంటిది ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన మాటను మన యువత ఎందుకు సాధించుకోదో నిరూపిస్తామన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ యువతీయువకులతో కలిసి తమ పార్టీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదాని సాధిస్తామన్నారు. అవసరమైతే తమ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఢిల్లీలో ధర్నా చేస్తారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంతదూరమయినా వెళ్తామన్నారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి సభలో పాల్గొన్న యువతీయువకులకు మైకులిచ్చి... మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమోనంటూ చెప్పారు. యువతీయువకులు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Guntur Yuvabheri Jagan Mohan Reddy Speech

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయలలిత డెడ్ బాడీనే అపోలోకు వచ్చింది.. నాడీ పనిచేయలేదు.. డాక్టర్ రామసీత

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలున్నాయ్. ఆమె అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ...

news

చిన్నమ్మ దొంగ.. జైలుకెళ్లిన శశి పాట ఇక ఆపండి.. మీడియాపై నెటిజన్ల ఫైర్.. జనాల్ని పిచ్చోళ్లు చేయొద్దు..

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో ప్రజల పక్షాన నిలిచిన పన్నీర్ సెల్వంను పక్కనబెట్టి.. చివరి ...

news

అమ్మ పేరు ఇక కనుమరుగు.. వేదనిలయం చిన్నమ్మ బంధువులకేనా? స్మారకమందిరం అవుతుందా?

దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఆరాధించే అన్నాడీఎంకే నేతలు చాలా ఎక్కువ. కార్యకర్తల నుంచి ...

news

మా కర్మకాకపోతే... ఓటేసి ఎమ్మెల్యేల్ని ఎన్నుకుంటే.. చిన్నమ్మకు సపోర్ట్ చేస్తారా? చిన్నమ్మ చికెన్ పీస్‌కు?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె విధేయుడు ఓపీఎస్ పార్టీని నడిపిస్తాడని, ఆయనే ...

Widgets Magazine