శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (20:32 IST)

జనసేనకు మూడేళ్లు.. పార్టీకి కొత్త వెబ్ సైట్.. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పవన్ పోటీకి సై..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కొత్త వెబ్ సైట్‌ను ప్రారంభించింది. జనసేన పార్టీ మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ పాల్గొ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కొత్త వెబ్ సైట్‌ను ప్రారంభించింది. జనసేన పార్టీ మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వెబ‌్‌సైట్‌ను ప్రారంభించారు.

ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించామని.. జూన్ నుంచి పార్టీ నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని..యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు.
 
జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలున్నారని, యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయించామని, పార్టీ నిర్మాణం పూర్తయ్యాక పొత్తులపై ఆలోచిస్తామని, అధికారం వచ్చినా.. రాకున్నా ప్రజల కోసం పార్టీ పనిచేస్తుందని, పార్టీ అంతిమ లక్ష్యం ప్రజా సమస్యలేగానీ.. అధికారం కాదని పవన్ స్పష్టం చేశారు.

పవన్ జనసేన వెబ్ సైట్ లుక్ ఎలా ఉంటుందంటే? పార్టీ, ఎన్ఆర్ఐ, మీడియా, ఇష్యూస్ వంటి అంశాలతో మెయిన్ మెనూను డిజైన్ చేశారు. అలాగే లోగోలో జనసేన గుర్తు పెట్టారు. ఇరు ప్రక్కల పవన్ కళ్యాణ్ ఇమేజ్ లను వుంచారు.
 
ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ ప్రకటించారు. జనసేన పార్టీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు పవన్. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.