శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 28 నవంబరు 2016 (12:31 IST)

జ‌న‌సేన‌కు గుండు సున్నానా? జ‌్యోతి స‌ర్వేపై ప‌వ‌న్ అభిమానుల ఆగ్ర‌హం

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్ప‌టికిపుడు ఎన్నిక‌లు జ‌రిగితే... టీడీపీ, బీజేపీల‌కు విజ‌యం ఖాయం. 2014 అసెంబ్లీ ఫ‌లితాలే పున‌రావృతం అవుతాయి. జ‌గ‌న్‌కు సీట్లు త‌గ్గుతాయి. జ‌నసేన‌కు గుండు సున్నా అంటూ ఆంధ్ర‌జ్యోతి ప్ర‌చురించిన స‌ర్వేపై తీవ్ర నిర

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్ప‌టికిపుడు ఎన్నిక‌లు జ‌రిగితే... టీడీపీ, బీజేపీల‌కు విజ‌యం ఖాయం. 2014 అసెంబ్లీ ఫ‌లితాలే పున‌రావృతం అవుతాయి. జ‌గ‌న్‌కు సీట్లు త‌గ్గుతాయి. జ‌నసేన‌కు గుండు సున్నా అంటూ ఆంధ్ర‌జ్యోతి ప్ర‌చురించిన స‌ర్వేపై తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఆంధ్రజ్యోతి సర్వే ప్రకారం జనసేనకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా రాద‌ట. 
 
4 శాతం క‌న్నా ఓటింగ్ కూడా ఉండ‌ద‌ట‌. త‌మ ప్ర‌త్య‌ర్థి ప‌త్రిక కాబ‌ట్టి... సాక్షి అధినేత జ‌గ‌న్ పార్టీకి ఓట్లు, సీట్లు త‌గ్గుతాయ‌ని రాయ‌డంలో కొంతైనా అర్థం ఉంటే ఉండవచ్చునేమో కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన‌కు ఒక్క సీటు కూడా రాద‌న్న‌ట్లు ఆ ప‌త్రిక స‌ర్వేలు ప్ర‌క‌టించ‌డాన్ని ప‌వ‌న్ అభిమానులు నిర‌సిస్తున్నారు. ఏపీ నుంచి తాను 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. 
 
ఈ స‌ర్వే ప్ర‌కారం... అంటే ప‌వ‌న్ కూడా బ‌రిలో గెల‌వ‌డ‌ని చెపుతారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్‌తో అవసరం తీరింది కాబట్టి టీడీపీ, బీజేపీ వ‌ర్గాలు ప‌వ‌న్‌ని కరివేపాకులా చేస్తున్నారా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక బీజేపికి పవన్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయ‌ని స‌ర్వే నివేదిక ఇచ్చారు. బిజేపికి సపరేట్‌గా, తెలుగుదేశంకి సపరేట్‌గా సీట్ల సంఖ్య చెప్పి జనసేనది చెప్పలేదు అంటే ఏంటి అర్ధం? అంతా కుమ్మ‌క్కు స‌ర్వే అని తేల్చేస్తున్నారు. 2019 ఎన్నికల వేడి అప్పుడే మొదలైందన్నమాట.