Widgets Magazine

సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తారా? జగన్‌కు పవన్ సూటి ప్రశ్న, నారా లోకేష్ కరెప్షన్ చూడండి...

బుధవారం, 14 మార్చి 2018 (19:23 IST)

Widgets Magazine
pawan kalyan

జనసేన ఆవిర్భావ సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని తూర్పారపడుతున్నారు. ఆయన మాటల్లోనే... ''ప్రత్యేక హోదా కోసం తెదేపాను అసెంబ్లీలో నిలదీసేందుకు జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అసెంబ్లీకి వెళ్లడంలేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తారా? ఏపీ యువత ప్రాణాలను నేను పణంగా పెట్టను. నువ్వు మాట్లాడతావు.... వెళ్లిపోతావని నన్ను నిలదీశారు.
 
నా నేల కోసం మాతృభూమి కోసం నేను చనిపోయేందుకు సిద్ధం. 2014లోనూ ఇదే చెప్పాను. సాటి మనిషి సమస్యను చూసి కన్నీళ్లు కార్చే శక్తి వుందా మీకు. మీరు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని కోసం భావోద్వేగానికి గురయ్యారు సీఎంగారు... కన్నీళ్లు కార్చారు... అనారోగ్యంతో చనిపోతున్నవారి కోసం కన్నీళ్లు పెట్టరా?
 
గత 2014 ఎన్నికల్లో స్కాం ఆంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ తెస్తామని చెప్పారు... కానీ అది కాలేదు కానీ కరెప్షన్ ఏపీ అయ్యిందండీ. రూ. 3 వేల లారీ ఇసుక దొరికితే... ఉచితం అని చెప్పి లారీ ఇసుకను రూ. 15 వేలు చేశారండీ. వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకున్న పిల్లల్ని ఫంక్షన్లకు ఎందుకు తీసుకెళుతున్నారండీ. వచ్చే 2019 ఎన్నికల్లో మీకు ఎందుకు మద్దతు ఇవ్వాలో చెప్పండి. పాలించాలంటే పెట్టి పుట్టాలా...
 
మీ అబ్బాయి నారా లోకేష్ గారి కరెప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో ముఖ్యమంత్రిగారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో వుంటాడో లేదోనని కరెప్షన్ చేస్తారా? ఎర్ర చందనం అమ్మితే చక్కని రాజధాని అని చెప్పారు. ఎక్కడండీ? 2019 ఎన్నికలు మాత్రం మీకు అంత తేలిగ్గా వుండవండీ అని చెప్పారు పవన్ కళ్యాణ్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెంటిమెంట్‌ కోసం డబ్బులివ్వరా? చట్టాలు మాకే కానీ.. మీకు కాదా?: పవన్ (LIVE)

జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ...

news

రాజధాని లేకుండా రాష్ట్రమిచ్చారు.. ఆంధ్రుల ఆవేదన ఏంటో చెప్తా: పవన్

జనసేన ఆవిర్భావోత్సవ సభ గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరుగుతోంది. జనసేన పార్టీ ...

news

గోరఖ్‌పూర్‌లో భాజపాను చావుదెబ్బ కొట్టింది ఎవరో తెలుసా?

ముప్పయ్యేళ్ల చరిత్ర మంచులా కరిగిపోయింది. ఒక్క దెబ్బతే భాజపా దిమ్మ తిరిగిపోయింది. వరుస ...

news

ఒక్కటంటే ఒక్కటే.. పామును ఇలా పట్టుకున్నారు (వీడియో)

ఓ పాము కోసం పెద్ద హంగామా చేసేశారు. పామును పట్టుకునేందుకు పెరటి మొత్తాన్ని తవ్వేశారు. ...