శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 13 మార్చి 2018 (17:47 IST)

పవన్, జగన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది... ఎందుకు?

అధికార తెలుగుదేశం పార్టీనే ఇన్ని రోజుల పాటు టార్గెట్ చేస్తూ వచ్చిన వైఎస్ఆర్ సిపి నేతలు ఇప్పుడు పంథాను మార్చారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పైన విరుచుకుపడుతున్నారు. గత కొన్నిరోజులుగా జనసేన నేతలు జగన్‌ను టార్గెట్ చేస్తే జగన్ పార్టీ నేతలు పవన్‌ను

అధికార తెలుగుదేశం పార్టీనే ఇన్ని రోజుల పాటు టార్గెట్ చేస్తూ వచ్చిన వైఎస్ఆర్ సిపి నేతలు ఇప్పుడు పంథాను మార్చారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పైన విరుచుకుపడుతున్నారు. గత కొన్నిరోజులుగా జనసేన నేతలు జగన్‌ను టార్గెట్ చేస్తే జగన్ పార్టీ నేతలు పవన్‌ను టార్గెట్ చేశారు. ఇప్పుడు వీరి మధ్య పేలుతున్న మాటల తూటాలే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. అసలు వీరి మధ్య ఈ స్థాయిలో తిట్ల పురాణం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమే.
 
ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ అట్టుడుగుతుంటే ఆ విషయంపైనే జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య బహిరంగ తిట్ల పురాణం ప్రారంభమైంది. మొదట్లో క్రిందిస్థాయి నేతలు తిట్టుకుంటే ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేతలే ఒకరినొకరు దూషించుకుంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్‌ జగన్ పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. నా తండ్రి ఏమీ ముఖ్యమంత్రి కాదు.. నేను ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను. అన్నింటిని తెలుసుకుంటున్నాను... ప్రజా సేవ చేస్తాను.. చంద్రబాబు చెప్పినట్లు జనసేన పార్టీ నడవడం లేదు. ప్రజలు చెప్పినట్లు పార్టీ నడుస్తుంది. ఆ విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని అన్నారు.
 
అంతకుముందే జగన్ జనసేనానిపై కొన్ని విమర్శలు చేశారు. కొంతమందికి రాజకీయాల గురించి అసలు తెలియదు. అలాంటి వారు కూడా మమ్మల్ని విమర్శిస్తారా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త పవన్‌కు తగిలినట్లుంది. దాంతో బాగా కోపం తెప్పించింది. అంతేకాదు కేంద్రానికి మేమేమీ దగ్గరవ్వడం లేదు. అదంతా కొంతమంది అనవసరంగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. కనీస అవగాహన ఉండాలి మీకు అంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు జగన్. దీంతో ఇద్దరి నేతలకు మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తూ భగ్గుమంటోందన్న చందంగా తయారైంది పరిస్థితి. అధికార తెలుగుదేశం పార్టీ నేతలపై ఉదయం లేచినప్పటి నుంచి దుమ్మెత్తి పోసే జగన్ ఇప్పుడు ఆ పార్టీపై విమర్శలు తగ్గించి పవన్‌నే టార్గెట్ చేయడం రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది. 
 
పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాత్రమే చెప్పారు. ఇంతవరకు అస్సలు అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. అలాంటిది జగన్ ఒక్కసారిగా పవన్‌ను విమర్శించడం రాజకీయ విశ్లేషకులకు అర్థం కాని ప్రశ్నలా తయారైంది. మొత్తంమీద జనసేన, వైసిపి నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్థం ఇప్పుడు ఎపిలోనే కాదు అటు పక్క రాష్ట్రం తెలంగాణాలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది.