శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (16:02 IST)

నాకు డబ్బులు కావాలి... సాయం చేయండి... జనసేనాని అభ్యర్థన

2019 ఎన్నికల బరిలో దిగాలని జనసేన గట్టి ఫిక్సయిన సంగతి తెలిసిందే. అందుకు ప్రజల మద్దతు ఒకటే సరిపోదని రియలైజయ్యింది. పార్టీని నడపడానికి డబ్బులు కూడా అవసరమని భావించి ఫండ్స్ సేకరించే పనిలో పడింది నాయకత్వం. పార్టీ ఫండ్స్ కోసం జనసేన కొత్త రూట్‌ను ఎంచుకుంది.

2019 ఎన్నికల బరిలో దిగాలని జనసేన గట్టి ఫిక్సయిన సంగతి తెలిసిందే. అందుకు ప్రజల మద్దతు ఒకటే సరిపోదని రియలైజయ్యింది. పార్టీని నడపడానికి డబ్బులు కూడా అవసరమని భావించి ఫండ్స్ సేకరించే పనిలో పడింది నాయకత్వం. పార్టీ ఫండ్స్ కోసం జనసేన కొత్త రూట్‌ను ఎంచుకుంది. విరాళాల కోసం ఏకంగా ఆన్‌లైన్‌లో కౌంటర్‌ను తెరిచారు. అసలేంటి జనసేన ప్లాన్? 
 
2014 సంవత్సరానికి జనసేన పార్టీ పెట్టారు. కానీ ఆ యేడాది ఎలక్షన్లలో పోటీకి దిగకుండా టిడిపికి, బిజెపికి మద్దతిచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. కానీ ఈసారి సీన్ మారిపోయింది. 2019 ఎన్నికలకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది జనసేన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్థమైంది జనసేన పార్టీ. అందుకోసం ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో ఉన్నారు పార్టీ నాయకులు. ఎలక్షన్లు దగ్గరపడుతున్నకొద్దీ పార్టీని నడిపేందుకు కార్యకర్తలు సరిపోరు, ఫండ్స్ కూడా కావాలని తెలుసుకున్నారు. 
 
అందుకు ఆన్‌లైన్‌లో డొనేషన్ల సేకరణ ప్రారంభించారు. ఇప్పటికే అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి ఆర్థిక, అంగబలాలతో ఎన్నికలకు రెడీగా ఉన్నాయి. కానీ జనసేన మాత్రం తమకు ప్రజల మద్దతే బలమన్న రీతిలో ఎలక్షన్లకు రెడీ అవుతోంది. అయితే ఎన్నికలంటే ఎంతో కొంత నిధులు అవసరం. అందుకే నేరుగా ప్రజల నుంచే విరాళాలను సేకరించేందుకు సిద్ధమైంది. స్వీకరించిన పార్టీ ఫండ్స్ ఎప్పుడూ ఎలా ఖర్చు పెట్టాలో కూడా డొనేషన్లు ఇచ్చేవారికి తెలియజేస్తామంటోంది జనసేన.
 
రాష్ట్రంలో జనసేన పార్టీ తరపున పోటీ చేసే ప్రతి అభ్యర్థికి ఎన్ఆర్ఐ నిధులు సమకూరేలా జనసేనాని ప్రణాళికలు రచిస్తున్నారట. ఈ బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌కు అప్పగించారట. ప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్లు ఇచ్చేందుకు భారీగా నిధులు సమకూర్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అలాంటి పరిస్థితి జనసేనలో రాకుండా ప్రజల నుంచి, తనకు తెలిసిన ఎన్ఆర్ఐల నుంచి మాత్రమే విరాళాలు సేకరించాలన్న ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్‌.