Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బంద్‌కు జనసేన మద్దతు: విరమించండి, పార్లమెంట్‌లో కలసి రండంటున్న మంత్రులు

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (22:22 IST)

Widgets Magazine

అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుపై జనసేన స్పందించింది. విపక్షాల బంద్ కు జనసేన పూర్తి మద్దతు తెలుపుతుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తెలియజేశారు. మరోవై పునరాలోచన చేసి బంద్ విరమించాలని ప్రభుత్వం తరపున మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. సమస్య న్యాయమైనదేనని, అయితే ఈ అంశంపై పార్లమెంటులో కలసిరావాలని కోరారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. 
pawan kalyan
 
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రం మూడున్నరేళ్ల చంటిబిడ్డ అని, చిన్నపిల్లలను ఎలా చూసుకుంటారో అలా రాష్ట్రాన్ని చూసుకోవాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిపెట్టి ఒక స్థాయికి తీసుకువచ్చారని చెప్పారు. ప్రపంచం అంతా మనవైపు చూస్తున్న తరుణంలో ఈ ప్రతిష్టని ఇంకా పెంచుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీలను ఒక పద్దతి ప్రకారం సాధించుకోవాలన్నారు. 
 
ఎన్డీఏలో తాము భాగస్వాములైనప్పటికీ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం... ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలుస్తూ నిరంతరం శ్రమిస్తూ మిత్రధర్మాన్ని పాటిస్తున్నారని చెప్పారు. హామీలు అమలు విషయంలో, కేంద్ర బడ్జెట్ కేటాయింపులలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడంలో జాతీయ స్థాయిలో టీడీపీ ఎంపీలు విజయం సాధించారని చెప్పారు. నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో బంద్ చేయడం వల్ల మనకే నష్టం జరుగుతుందన్నారు. 
 
వామపక్షాలకు ఇక్కడ శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా పార్లమెంట్‌లో వారి సభ్యులు ఉన్నందున కేంద్రంపై ఢిల్లీలో పోరాడాలన్నారు. ఈ అంశంలో ప్రధాని కల్పించుకున్నప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. మిత్రపక్షంగా ఉంటూ కేంద్రంపై ఈ విధమైన ఆందోళన చేయడం దేశంలో తాను మొదటిసారి చూస్తున్నానన్నారు. ఢిల్లీలో తమ ఎంపీలతో కలసి ఆ ఆందోళనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. బంద్ వల్ల  రాష్ట్రానికి నష్టమేకాకుండా, ప్రజలు ఇబ్బందులుపడతారని,  అందువల్ల వామపక్షాలు, ఇతర పార్టీలు బంద్ పైన పునరాలోచన చేసి విరమించాలని అచ్చెన్నాయుడు కోరారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హక్కుల సాధన కోసం జేఏసీ... పోటీ చేయకపోవడం బాధేస్తోంది : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం సంయుక్త కార్యాచరణ కమిటీ (జాయింట్ యాక్షన్ కమిటీ)ని ...

news

ఏపీ ప్రజలకు న్యాయం జరుగుతుందనే మద్దతిచ్చా : పవన్ కళ్యాణ్ (లైవ్ వీడియో)

విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించే ఏపీ ...

news

ఆ చెల్లాయి కడుపున పుట్టిన బిడ్డకు తండ్రి.. 14ఏళ్ల సోదరుడే.. ఎక్కడ?

14ఏళ్ల అన్నయ్య కారణంగా 11 ఏళ్ల చెల్లాయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్పెయిన్ దేశంలో ...

news

రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్న కానిస్టేబుల్... ఎలా?

ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ ...

Widgets Magazine