శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (16:15 IST)

పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాం : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వల్లే గెలిచిందనీ, వచ్చే ఎన్నికల్లోనూ జనసేన పార్టీ తమ టీడీపీతోనే ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వల్లే గెలిచిందనీ, వచ్చే ఎన్నికల్లోనూ జనసేన పార్టీ తమ టీడీపీతోనే ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రపై చింతమనేని స్పందించారు. 
 
10 లక్షల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జగన్ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. ప్రజలు ఇస్తే వచ్చేది సీఎం పదవి అని చెప్పారు. నేనే సీఎం... నేనే సీఎం అంటూ జగన్ ప్రతిరోజూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవినీతి కేసుల్లో ఉన్న జగన్‌ను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. 
 
ప్రత్యేక హోదావల్లే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని, ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తారని, చంద్రబాబునో, తననో చూసి పారిశ్రామికవేత్తలురారనీ వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటరిచ్చారు. 
 
చంద్రబాబును, నన్ను చూసి పరిశ్రమలు రావని జగన్ అంటున్నారని... ఆయన చెప్పింది నిజమేనని, జగన్‌ను చూసి రాష్ట్రానికి ఎవరూ రారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో జగన్‌లో నాయకత్వ లక్షణాలు లేవని మరోమారు నిరూపితమైందన్నారు.