శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 1 డిశెంబరు 2017 (22:00 IST)

ప్రధాని కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు... జె.సి. సంచలన వ్యాఖ్యలు

అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఎంపిలు కరివేపాకులు అని చేసిన వ్యాఖ్యలు మరిచిపోక ముందే ఈరోజు తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి, ప్రధానమంత్రికి కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఏపికి నిధులు ఇవ

అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఎంపిలు కరివేపాకులు అని చేసిన వ్యాఖ్యలు మరిచిపోక ముందే ఈరోజు తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి, ప్రధానమంత్రికి కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఏపికి నిధులు ఇవ్వాలనుకుంటే కేంద్రం ఇస్తుంది. అంతేతప్ప ప్రధాని కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సినంత కర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టలేదన్నారు జె.సి.దివాకర్ రెడ్డి. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడంటే ఏమనుకున్నారు.. ఆయనొక బ్రాండ్.. అలాంటిది కేంద్రానికి సాగిలపడాలా.. ఏంటి? మాకు అవసరం లేదు. ప్రధాని ఇవ్వాలనుకుంటే నిధులు ఇస్తారు. ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపైనా ఉందని ఏకంగా ప్రధానినే టార్గెట్ చేశారు జె.సి. దివాకర్ రెడ్డి.