Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీజేపీ ఆకలితో ఉంది.. తమిళనాడులా ఏపీని కూడా?: జేసీ

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:36 IST)

Widgets Magazine
JcDiwakara

కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆకలితో ఉందని.. ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.  ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మరీ కేంద్రం చుట్టూ తిరుగుతుంటే.. కేంద్రం మాత్రం ఆయన్ని నియంత్రించాలనుకుంటుందని చెప్పుకొచ్చారు.

అందుకే పోలవరం విషయంలో లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. పోలవరం విషయంలో ఏవైనా అనుమానాలుంటే అడిగి తెలుసుకోవాలి కానీ పిలిచిన టెండర్లను ఆపాలనడం సరికాదని జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోందని జేసీ విమర్శించారు. పోలవరాన్ని ఆపాలని ప్రయత్నిస్తే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని జేసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరానికి సృష్టిస్తున్న ప్రతిబంధకాలు పాలనాపరమైనవిగా అనిపించట్లేదన్నారు. అంతా రాజకీయ కారణాల వల్లే బీజేపీ అలా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం కనుక ఏపీతో వైరం పెట్టుకుంటే మూడేది వారికేనని జేసీ హెచ్చరించారు. 
 
అంతేగాకుండా బీజేపీపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో వుంచుకుని.. తమిళనాడులా ఏపీని కబళించాలనే ప్రయత్నాలు కేంద్రం పెద్దలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 15 రోజుల్లో పోలవరం వ్యవహారం చక్కబడుతుందని, లేదంటే పార్లమెంట్‌లో పోరాడతామని చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గొర్రెలు, పశువులు, పందుల్లా కొంటున్నారు : జగన్ ధ్వజం

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను గొర్రెలు, పశువులు, పందుల్లా కొనుగోలు చేస్తున్నారనీ వైకాపా ...

news

బలోపేతం దిశగా జనసేన పార్టీ...(వీడియో)

పవన్ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా దూసుకెళుతోంది. ...

news

ఆయన మాకు బాగా కావాల్సినంత... ఆనం వివేకా ఫైర్

కాంగ్రెస్ హయాంలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన ఆనం బ్రదర్స్ హవా ...

news

హైదరాబాదులో ఆమె నృత్యానికి ఇవాంకా ట్రంప్ ఫిదా...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకు హైదరాబాద్ లో ఒకటే ఒకటి బాగా నచ్చిందట. ...

Widgets Magazine