Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాట తప్పం.. మడమ తిప్పం... తెలంగాణ అభివృద్ధికి కట్టుబడివున్నాం : మోడీ

మంగళవారం, 28 నవంబరు 2017 (14:39 IST)

Widgets Magazine
modi

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి భాగ్యనగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడివున్నట్టు ప్రకటించారు. మాట తప్పం.. మడమ తిప్పబోమని, అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 
 
మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన నరేంద్ర మోడీ కొద్దిసేపు బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఒకటి రెండు నిమిషాల పాటు తెలుగులో మాట్లాడి అందరినీ మురిపించారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ఆయన.. తెలుగులోనే ముగించారు. హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. 
 
హైదరాబాద్ అంటే  తనకు సర్దార్ పటేల్ గుర్తుకు వస్తారని అన్నారు. తెలంగాణ విమోచనంలో అమరులైన వీరులకు జోహార్లు పలికారు. హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరమని… నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అభినందనలు అన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఇపుడు అందరి దృష్టి హైదరాబాద్‌పై ఉందని… గ్లోబల్ సమ్మిట్ కోసం ఎంతో మంది దేశవిదేశీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని గుర్తుచేశారు. 
 
బీజేపీ కార్యకర్తలు చేస్తున్న త్యాగం… భారత మాత సేవ కోసం.. సమాజ కోసం చేస్తున్న వారు చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని… దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలో అధికారంలో లేకపోయినా.. సమాజం కోసం అపూర్వ త్యాగాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమని.. తెలంగాణ ప్రజలపై విశ్వాసం ఉందని.. రాష్ట్రంలో ఎవరున్నా.. తమ సహకారం అందుతూనే ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దమ్ముంటే శ్రీనగర్‌లో భారత జెండాను ఎగురవేయండి చూద్దాం

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కాదు.. దమ్ముంటే శ్రీనగర్‌లో భారత జెండాను ఎగరవేయండి చూద్దాం ...

news

మెట్రో రైలు ప్రాజెక్టును కూలగొడుతామన్న కేసీఆర్ (వీడియో)

హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే ...

news

పాడేరు, అరకులో గెలిచేది వైకాపానే: గిడ్డి ఈశ్వరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన గిడ్డి ఈశ్వరి చేసిన ...

news

మోడీ 'ఫిదా'... ఆ కుర్రోడికి ఫోన్ చేశారు.. ఎందుకో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఫిదా' అయిపోయారు. అంతటితో ఆగలేక ఆయన స్వయంగా ఆ కుర్రోడికి ఫోన్ ...

Widgets Magazine