శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 నవంబరు 2014 (21:48 IST)

తెదేపా సభ్యత్వం తీసుకోని జూ.ఎన్టీఆర్... ఖచ్చితంగా పార్టీతో కటీఫా...?

జూనియర్ ఎన్టీఆర్ - నారా ఫ్యామిలీ గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకూ తీసుకోలేదనే వార్తే. తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నవంబరు నెలలోనే ప్రారంభమైంది. అప్పుడు తొలుత చంద్రబాబు నాయుడు సభ్యత్వాన్ని నమోదు చేయించుకోగా ఆ వెనువెంటనే నందమూరి హరికృష్ణ తీసుకున్నారు. 
 
కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకూ సభ్యత్వాన్ని తీసుకోలేదట. అసలు నమోదు కార్యక్రమం వైపు తొంగిచూడనే లేదని చెపుతున్నారు. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ సభ్యత్వంపై అయిష్టత ఉండటమేననే వాదనలు వినిపిస్తున్నాయి.
 
మొన్న ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పిలిచిన చంద్రబాబు తనను మాటమాత్రం పట్టించుకోలేదనే ఆవేదనలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు కొందరు చెపుతున్నారు. పైగా పార్టీలో తన తండ్రికి సరైన స్థానం ఇవ్వలేదనీ, అందువల్ల కూడా ఎన్టీఆర్ కినుక వహిస్తున్నట్లు సమాచారం.
 
అసలు తమకు గౌరవం లేని పార్టీలో సభ్యత్వం దేనికన్న అభిప్రాయంలో ఆయన ఉన్నాడని మరో వర్గం వాదిస్తుంది. పార్టీతో తెగతెంపుల కోసమే జూనియర్ ఎన్టీఆర్ ఇలా చేస్తున్నారని వారంటున్నారు. మరోవైపు సభ్యత్వానికి మరో వారం రోజులే గడువు మిగిలి ఉందనీ, ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి స్టెప్పు తీసుకుంటాడనే ఆసక్తి నెలకొంది. తన జీవించి ఉన్నవరకూ తాత పెట్టిన పార్టీలోనే ఉంటానని చెప్పిన ఎన్టీఆర్ ఏం చేస్తాడో వెయిట్ అండ్ సీ.