శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (12:37 IST)

సంఖ్యాబలం లేక రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం.. జానారెడ్డి

సంఖ్యాబలం లేక రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు ఆ పార్టీ టీ కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి తెలిపారు. రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 11న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గత నాలుగైదు రోజులుగా కసరత్తులు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ ఎన్నికలకు దూరంగా ఉండాలని తాజాగా నిర్ణయించింది.
 
ఇదే అంశంపై కె జానారెడ్డి మాట్లాడుతూ... రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునే బలం లేకపోవడంతో అనవసరంగా పోటీ చేసి అభాసు పాలవడం, పార్టీ ప్రతిష్ట దిగజార్చడం కన్నా పోటీ చేయకుండా ఉండటమే ఉత్తమమని తెలిపారు. విజయానికి తగిన సంఖ్యా బలం లేనప్పుడు ఎన్నికల బరిలో దిగి రాజకీయాలను కలుషితం చేయకూడదని తమ పార్టీ భావిస్తున్నామన్నారు. 
 
పాలేరు ఉప ఎన్నిక ఫలితం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి ఆంశాలపై సీఎల్పీలో చర్చించినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత టీ జీవన్‌రెడ్డి, ఉత్తమ్ పద్మావతిరెడ్డి, ఆకుల లలిత, పీ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.