అనుమానం పెనుభూతమైంది.. భార్య తల నరికి స్టేషన్‌కు పట్టుకెళ్లాడు...

murder
Last Updated: బుధవారం, 10 అక్టోబరు 2018 (10:53 IST)
అనుమాను పెనుభూతమైంది. కట్టుకున్న అని కూడా చూడకుండా ఆమె నరికేశాడు. ఆ తలను పట్టుకుని నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడో అనుమానపు భర్త. ఈ దారుణం కడప జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం వడ్డెపల్లె సమీపంలో పుసుపులేటి వెంకటరమణ (40) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన రాణి (35)ని గత 1999లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. 
 
సాఫీగా సాగిపోతున్న వీరి కుటుంబంలో ప్రియుడి రూపంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. గల్ఫ్‌ దేశం నుంచి కొన్ని నెలల కిందట ఇంటికి వచ్చిన వెంకటరమణ తరుచూ భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత నెల రోజుల కిందట భార్య రాణి, ప్రియుడిపైన సంబేపల్లె పోలీసుస్టేషన్‌లో వెంకటరమణ ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణ జరుగుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో భార్య రాణి రాయచోటిలో కొనుగోలు చేసిన ఇంటి జాగాను విక్రయించేందుకు ప్రయత్నించింది. అయితే, ఈ స్థలానికి సంబంధించిన పత్రాలు వెంకటరమణ వద్ద ఉన్నాయి. దీంతో ఆ స్థలం పట్టా కాగితాలను ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో భార్య వివాహేతర సంబంధంతో పాటు గల్ఫ్‌ నుంచి పంపిన డబ్బులను విలాసాల పేరుతో తగలెట్టిందన్న ఆగ్రహంతో భార్య తల నరికిన వెంకటరమణ ఆ తలను పట్టుకుని నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
 
ఆ తర్వాత వెంకటరమణను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని, గోనె సంచిలో తెచ్చిన తలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత చదవండి :