శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (09:43 IST)

టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో.. రాజుగారిపై సస్పెన్షన్ వేటు?

టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో బోలెడు వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో కలకలం రేపింది. కాకినాడ మున్సిపల్ వైస్ చైర్మన్ క

టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో బోలెడు వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో కలకలం రేపింది. కాకినాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కోరిపూరి రాజు ఈ వీడియోను పోస్టు చేయడంతో వివాదం రాజుకుంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో రాజుపై టీడీపీ అధిష్టానం గుర్రుగా వున్నట్లు సమాచారం. అయితే ఈ వీడియోను తాను పోస్ట్ చేయలేదని పిల్లలు పొరపాటున ఆ వీడియోను పోస్టు చేశారంటూ రాజు చెప్పుకొస్తున్నారట.  
 
వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోను పోస్టు చేసిన రాజుపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దాపురం టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆయన్ని సస్పెండ్ చేయాలని వారు అధిష్టానాన్ని కోరుతున్నారు. అగ్రనాయకులుండే వాట్సాప్ గ్రూపులో.. అభ్యంతరకర వీడియోను పోస్ట్ చేయడంతో రాజుపై సస్పెన్షన్ వేటు వేసేందుకు అదిష్టానం కూడా సిద్ధంగా వున్నట్లు సమాచారం.