శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (15:31 IST)

వెబ్‌సైట్‌లో ఉద్యోగుల పంపకాలపై కమల్‌నాథన్ కమిటీ గైడ్‌లైన్స్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలను కమల్‌నాథన్ కమిటీ ఖరారు చేసింది. శుక్రవారం ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన భేటీలో ఉద్యోగుల పంపిణీపై దాదాపు 2 గంటల పాటు కమిటీ మంతనాలు జరిపింది. ఈ అంశంపై రెండు రోజులు కేంద్రం ప్రభుత్వం ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
కాగా, ఈ కమిటీ ఖరారు చేసిన గైడ్‌లైన్స్‌లో అనేక అంశాలపై స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని, ఆర్టికల్ 371డి ప్రకారం ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తే అక్కడే స్థానికత వర్తిస్తుందని కమిటీ వెల్లడించింది. 
 
ఒంటరి మహిళ, భార్యభర్తలకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయని, రెండేళ్ళలో రిటైరయ్యేవారికి ఆప్షన్లు లేవని కమల్‌నాథన్ కమిటీ పేర్కొంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 10 రోజుల్లోగా వెల్లడించాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కూడా పాల్గొన్నారు.