Widgets Magazine

కేసీఆర్ సాధించలేనిది... కవిత సాధించిందీ ఏమిటి? ఆర్కే బీచ్‌లో తెరాస జండా పాతేయడమేనా?

హైదరాాబాద్, గురువారం, 26 జనవరి 2017 (05:39 IST)

Widgets Magazine
Kavitha

అదను చూసి దెబ్బ కొట్టడమంటే ఏమిటో కేసీఆర్ కుమార్తె కవితను అడిగితే చక్కగా చెబుతారని ఊహించవచ్చు. సీమాంధ్రప్రాంతం అన్నా, సీమాంధ్రులన్నా ద్వేషభావాన్ని పెంచి, రంగరించి, తెలంగాణలో గ్రామస్థాయికి కూడా తీసుకుపోయిన తెరాస పార్టీలో ముఖ్యనేత కవిత ఏమిటి? ఆంధ్రప్రదేశ్‍కు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటానికి తాను మద్దతిస్తున్నట్లుగా ప్రకటించడం ఏమిటి? ఏపీకి హోదా డిమాండుకు తాను పూర్తి మద్దతునిస్తామని, పార్లమెంటులో దీనిపై పోరాడతామని కవిత ఉన్నట్లుండి చేసిన ప్రకటన రాజకీయ పర్యవసానాలేమిటి? 
 
తెలంగాణకు చెందిన తెరాస పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలుపెట్టడం అసంభవం అనుకుంటున్న సమయంలో కవిత తెరాసను విశాఖ ఆర్కే బీచ్ వరకు తీసుకుపోయారు. లేనిపోని వాగ్దానాలు చేసి, కోటి ఆశలు, భ్రమలు పెంచి పోషించి అధికారంలోకి వచ్చిన వారు 5 కోట్ల మంది ప్రయోజనాలను గాలికి వదిలేసి, ప్రత్యేక హోదా ఎజెండానే పక్కనపెట్టేసిన పాడు కాలంలో పొరుగున ఉన్న, బద్ద శత్రువు అనుకున్న పార్టీనుంచి ఒక ముఖ్యనేత ఈరోజు నేరుగా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తున్నారంటే సీమాంధ్ర పాలకులు సిగ్గుపడాల్సిన విషయం కాదా అని సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.
 
ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌ను శత్రు ప్రాంతంగా వలసపాలకుల ప్రాతంగా చూసిన తెరాస నాయకులు కూడా ప్రత్యేకహోదాకు మద్దతు ఇస్తోంటే.. ఏపీలో పాలన సాగిస్తున్న తెలుగుదేశం శ్రేణులు మాత్రం ఈ డిమాండ్‌కు అనుకూలంగా లేకపోవడం. ఏపీ హోదా గురించి గులాబీ పార్టీకి ఉన్న శ్రద్ధ కూడా పాలన సాగిస్తున్న పసుపుపచ్చపార్టీకి లేకపోవడం సిగ్గు చేటు అని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కనీసం పొరుగు రాష్ట్రం వారికి ఏపీ బాగు గురించి ఉన్న సానుభూతి కూడా సొంత ప్రాంతం వారికి లేకుండా.. హోదా కోసం జరుగుతున్న పోరాటాలకు పాలకులే మోకాలడ్డుతుండడం ఘోరం కాక మరేమిటి!
 
ఏపీ ప్రత్యేక హోదాపై కవిత ఆకస్మిక మద్దతు ప్రకటన వచ్చాక నెటిజన్లు జోకులు మీద జోకులు వేసుకుంటున్నారు. కేసీఆర్‌కి సాధ్యం కానిది, కేటీఆర్‌కి సాధ్యం కానిది, హరీష్ రావుకు సాధ్యం కానిది అయిన ఘనకార్యాన్ని కవిత అవలీలగా సాధించారట. అదేమిటంటే.. ఈ ఒక్క ప్రకటనతో ఏపీలో తెరాస శాఖ ఏర్పాటుకు కవిత పునాది రాయిని ఆర్కే బీచ్‌లో పాతేసిందని అంతర్జాలంలో జోకులే జోకులు. 
 
ఏదేమైనా ఒక మాట చెప్పుకోవాలి. టైమింగ్ అనే పదానికి అసలైన అర్థాన్ని వివరించారు కల్వకుంట్ల కవిత. దాని ప్రభావం విశాఖ బీచ్ వరకూ పాకింది మరి. మొన్న మొన్నటి వరకూ ఏపీ ప్రత్యేకహోదా అడిగిన ప్రతిసారీ.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణకు కూడా హోదా ఇవ్వాలంటూ కొందరు తెరాస ఎంపీలు డిమాండ్ చేయడం జరుగుతూ ఉండేది. కానీ.. తాజా పరిణామాల్లో ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కవిత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేయడం ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఏపీ యువతకు అనూహ్య వరం లాంటిదేనని చెప్పాలి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జల్లికట్టు సాక్షిగా ఇది బాబు స్వయంకృతాపరాధం కాదా?

ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజానీకంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆగ్రహజ్వాలలకు చంద్రబాబు ...

news

హోదా గొడవ సమసిపోయిందనుకుంటే మళ్లీ ఇలా తగులుకుందేమిటీ బాబో..: బాబు మల్లగుల్లాలు

ప్రత్యేక హోదా విషయంలో ఎన్ని తుపానులు ఎదుర్కొన్నాను, ఎన్ని అవమానాల పాలయ్యాను.. ప్రజల వద్ద ...

news

ప్రత్యేక హోదా ర్యాలీకి పవన్ రానట్లేనా?

నేడు విశాఖ సాగరతీరంలో జరగనున్న ప్రత్యేక హోదా అనుకూల ర్యాలీలు, మౌన దీక్షలకు జనసేన ...

news

జగనే కాదు సాగరతీరంలోకి ఎవరొస్తారో అదీ చూస్తాం : పోలీసు కమిషనర్ సవాల్

ప్రత్యేక హోదా డిమాండుతో ఆంధ్రప్రదేశ్ యువత అట్టుడికిపోతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో నేడు ...