Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో కవిత.. అమరావతికి రాక.. ఆ సదస్సులో వేదిక పంచుకుంటారా?

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:17 IST)

Widgets Magazine
Kavitha

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు కవిత హాజరుకానున్నారు. మన దేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా అనేకమంది డెలిగేట్స్ ఈ సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు అమరావతికి చేరుకున్నారు.
 
అలాగే టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధులు కూడా ఈ సదస్సు కు రానున్నారు. శుక్రవారం కవిత అమరావతికి చేరుకుని సదస్సులో పాల్గొంటారు. అమరావతి పర్యటన సందర్భంగా కవిత విజయవాడ దుర్గమ్మను కూడా దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారని సమాచారం. ఈ సదస్సులో ఏపీకి చెందిన మంత్రులతో పాటు, కేంద్ర మంత్రులు వెంకయ్య, స్మృతి ఇరానీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సదస్సులో పాల్గొంటారు. 
 
కేరళ, కొన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, నాలుగు రాష్ట్రాల నుంచి స్పీకర్లు హాజరు కానున్నారు. శ్రీలంక ప్రథమ మహిళ మైత్రేయి విక్రమసింఘె, అమెరికా చట్ట సభ ప్రతినిధి అరుణ్‌మిల్లర్‌, కెన్యా నుంచి నలుగురి రాక ఖరారైందని సమాచారం. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం కోడలు బ్రాహ్మణి కూడా పాల్గొంటారు. దీంతో కవిత.. బ్రాహ్మణితో కలిసి వేదిక పంచుకుంటారా అనేది తెలియాల్సి వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గోల్డెన్ బే రిసార్ట్‌‌లో ఎమ్మెల్యేల ఎంజాయ్‌మెంట్.. పన్నీర్ వెంట పోతారా? చిన్నమ్మకు ఓటేస్తారా?

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం చెంతకు తన క్యాంప్ ఎమ్మెల్యేలు చేరిపోకుండా శశికళ ...

news

20మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారా? పన్నీర్‌కు సపోర్ట్‌గా ఓటేస్తారా? ఓపీఎస్ వేషం వేస్తున్నారా?

తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. గవర్నర్ విద్యాసాగర్ రావు ...

news

పన్నీర్ ప్రధాన అస్త్రం అదే... మ్యాజిక్ ఫిగర్ 117... సెల్వం పక్షాన 15 మంది... ఏం జరుగుతుంది?

ముఖ్యమంత్రి కుర్చీ కోసం అసెంబ్లీలో బల నిరూపణ చేసేందుకు తనకు ఓ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ...

news

తమిళ తకరారు : నిర్ణయం గవర్నర్ చేతిలో.. పన్నీర్ దూకుడు... చిన్నబోయిన శశికళ

తమిళ తకరారు రాజ్‌భవన్‌కు చేరింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మంకుపట్టి కూర్చొన్న ఆపద్ధర్మ ...

Widgets Magazine