Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశి(కళ-జయ)లలిత సినిమా తీయబోతున్నా... కనిమొళికి ఏమైంది? కేతిరెడ్డి ఆగ్రహం(Video)

మంగళవారం, 16 జనవరి 2018 (16:54 IST)

Widgets Magazine

లక్మీస్ వీరగ్రంధం సినిమా దర్శకుడు, నిర్మాత తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని అఖిలాండం వద్ద బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో మాట్లాడుతూ... తమిళంలో శశి(కళ-జయ)లలిత చిత్రాన్ని త్వరలో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. తను ఏ శుభకార్యామైనా శ్రీవారి ఆశీస్సులతో మొదలుపెట్టడం ఆనవాయితీగా గత 40 సంవత్సరాలుగా చేస్తున్నట్లు తెలిపారు.
KethiReddy
 
తెలుగు యువశక్తి స్థాపించినప్పుడు కూడా ఆ రిజిస్ట్రేషన్ కాగితలను స్వామి పాదాల చెంత ఉంచటం జరిగిందని గుర్తు చేసుకున్నారు. అందుకే ఆ సంస్థ ఇప్పటివరకు వెలుగొందుతున్నదని... నా నీడ... నా జాడ... వెంకన్నేనని తెలిపారు. ఇటీవల రాజ్యసభ సభ్యురాలు కనిమొళి వెంకన్నపై చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తంచేశారు. ఒక బాధ్యతగల స్థానంలో ఉన్నవారు హిందువుల ఆరాధ్యదైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి డబ్బు ఉన్నవారికే దైవం అనీ, దేవుడి యొక్క భద్రత విషయంలో కూడా ఆమె మాట్లాడిన మాటలు శ్రీవారి భక్తులను ఎంతో కలతకు గురిచేసిందన్నారు.
 
తమ రాజకీయ అవసరాల కొరకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమనీ, ఆమె వెంటనే తన తప్పును తెలుసుకొని శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Dmk Kanimozhi Tirumala Sasilalitha Tamil Nadu Mp Kethireddy Jagadishwar Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారతీయుడిగానే చనిపోవాలంటున్న పాక్ పౌరుడు

పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన పౌరుడు ఒకడు భారతీయుడిగానే చనిపోవాలని ఆశపడుతున్నారు. కానీ, భారత ...

news

టీ కప్పులో తుఫానులా సుప్రీం వివాదం... జడ్జీల మధ్య సయోధ్య

యావత్ దేశ ప్రజలను దిగ్భ్రమకు గురిచేసిన సుప్రీంకోర్టు వివాదం టీ కప్పులో తుఫానులా ...

news

బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకలు.. ఓ గ్రూపు నడిరోడ్డుపై ఓ అమ్మాయిని?

కొత్త సంవత్సర వేడుకలు ఐటీ రాజధాని నగరం బెంగళూరులో అట్టహాసంగా జరుగుతాయి. టెక్కీలతో పాటు ...

news

అవినీతి అధికారుల చిట్టా నావద్ద ఉంది.. మరో భారతీయుడినవుతా... కమల్

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే ఒక యాప్‌ను తయారుచేసి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ...

Widgets Magazine