శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (10:46 IST)

అమ్మ వీడియోపై 100 ప్రశ్నలు.. తడబడిన శశికళ మేనకోడలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు.. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెట్రివేల్ విడుదల చేసి వీడియో సంచలనం సృష్టించింది. ఈ వీడియో అపోలో ఆస్పత్రిలో తీసినట

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు.. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెట్రివేల్ విడుదల చేసి వీడియో సంచలనం సృష్టించింది. ఈ వీడియో అపోలో ఆస్పత్రిలో తీసినట్లు దినకరన్ వర్గం చెప్పుకొచ్చింది. ఆర్కేనగర్ ఎన్నికలకు ముందు రోజు ఈ వీడియోను దినకరన్ వర్గం విడుదల చేసింది. 
 
ఈ వీడియో ప్రభావ మహత్తో లేకుంటే డబ్బు మహత్తో తెలియదు కానీ ఆర్కే నగర్ ఎన్నికల్లో టీటీవీ గెలుపును నమోదు చేసుకున్నాడు. ఈ గెలుపుతో కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్న దినకరన్‌.. మళ్లీ అన్నాడీఎంకేతో కలిసి పనిచేందుకు సై అంటున్నాడు. అయితే అమ్మ వీడియోపై మళ్లీ చర్చ మొదలైంది. ఎలాగంటే.. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ముందు బయటకు వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వీడియోపై జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ వేసిన ప్రశ్నలకు శశికళ మేనకోడలు కృష్ణప్రియ తడబడ్డారు. ఇప్పటికే అమ్మ మృతికి సంబంధించిన తన వద్ద వున్న పెన్ డ్రైవ్‌లను టీటీవీ దినకరన్ కమిషన్ ముందు సమర్పించారు. 
 
తాజాగా అమ్మ వీడియోపై కమిషన్ వందకు మించిన ప్రశ్నలు సంధించడంతో కృష్ణప్రియ సరైన సమాధానాలు చెప్పలేకపోయినట్టు సమాచారం. జయలలిత మృతిపై అనుమానాలు రేకెత్తడంతో ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. ఇప్పటికే పలువురిని విచారించిన అర్ముగస్వామి ఎదుట తాజాగా శశికళ మేనకోడలు కృష్ణ ప్రియ హాజరయ్యారు. జయ వీడియోను తీసింది ఎవరు? శశికళ తీశారా? ఇలా ఎన్ని వీడియోలు తీశారు? అన్న ప్రశ్నలకు కృష్ణ ప్రియ నుంచి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.