శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (14:21 IST)

అమ్మ గదిలో సోదాలు.. జయలలిత వీడియో నమ్మశక్యంగా లేదు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె నివాసమైన పోయెస్‌గార్డెన్‌లో ఐటీ శాఖ మళ్లీ సోదాలు నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలల పాటు ఐటీ అధికారులు తమిళనాడులోని పలు ప్రాం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె నివాసమైన పోయెస్‌గార్డెన్‌లో ఐటీ శాఖ మళ్లీ సోదాలు నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలల పాటు ఐటీ అధికారులు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ బంధువుల నివాసాలు, జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌తో పాటు 100 చోట్ల సోదాలు నిర్వహించారు. 
 
కానీ పోయెస్ గార్డెన్‌లో అమ్మ గదిని మాత్రం సోదాలు చేయకుండా వదిలిపెట్టేశారు. ప్రస్తుతం అమ్మ గదిలో సోదాలు నిర్వహించేందుకు తగిన అనుమతులను సంపాదించిన ఐటీ అధికారులు.. పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చబోతున్నట్లు తెలిపి అమ్మ గదిని సోదాలు చేసినట్లు తెలిసింది.    
 
ఇదిలా ఉంటే, శశికళ మేనల్లుడు దినకరన్ వర్గం విడుదల చేసిన దివంగత జయలలిత వీడియోపై తమిళనటుడు ఆనందరాజ్ మండిపడ్డారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత అంటూ విడుదలైన వీడియో నమ్మశక్యంగా లేదన్నారు. కనీసం జయలలిత ఒంటి మీద దుస్తులను కూడా సరిచేయకుండానే ఈ వీడియోను తీశారని... ఈ వీడియో కారణంగా పార్టీ శ్రేణులు, అమ్మను ఆరాధించే కోట్లాదిమంది ఎంతో ఆవేదనకు గురయ్యారని అన్నారు.