Widgets Magazine

తమిళనాడులో రవాణా కార్మికుల సమ్మె : స్తంభించిన ప్రజారవాణా

మంగళవారం, 9 జనవరి 2018 (11:26 IST)

monkey

తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ రవాణా కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. వేతన పెంపుతోపాటు పీఎఫ్‌ బకాయిలను తక్షణం చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌తో రవాణా కార్మికులు గత గురువారం నుంచి సమ్మెకు దిగారు. ఈ సమ్మె విరమణ కోసం ప్రభుత్వం పలు దఫాలుగా జరిగిన చర్చలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. తమ పీఎఫ్ బకాయిలను తక్షణం చెల్లించాల్సిందేనని రవాణా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 
 
మరోవైపు సమ్మెను తక్షణం విరమించాలని కోరుతూ హైకోర్టు ఆదేశించినప్పటికీ.. కార్మికులు ఖాతరు చేయలేదు. పైగా సమ్మెను మరింత ఉధృతం చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులోభాగంగా, మంగళవారం నుంచి రవాణా కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇదిలావుంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు డ్రైవర్లుగా మారి ఒకరోజు బస్సులను నడిపారు. ఆతర్వాత వీరంతా పత్తాలేకుండా పోయారు. 
 
ఇంకోవైపు, సంక్రాంతి పండుగకు ఊరెళ్లేందుకు నగర వాసులు ఉత్సాహంతో ఉన్నారు. అయితే, అన్ని రకాల బస్సు సేవలు అందుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అదేసమయంలో రైళ్ళలో తీవ్రమైన రద్దీ నెలకొనివుంది. దీంతో దక్షిణ రైల్వే అదనపు రైళ్లను నడుపుతోంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Aiadmk Bus Strike High Court Tamil Nadu

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్రమంగా డాలర్ల రవాణా ... జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్‌హోస్టెస్ అరెస్టు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్ ఎయిర్‌వేస్ విమాన సంస్థకు చెందిన ...

news

బెంగుళూరు స్కూల్‌లో విషాదం... వీడియో

బెంగుళూరు స్కూల్‌లో దారుణం జరిగింది. బెంగుళూరు స్కూల్ వార్షిక వేడుకల్లో విషాదం ...

news

టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో.. రాజుగారిపై సస్పెన్షన్ వేటు?

టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో బోలెడు వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో ...

news

గాంధీని చంపింది గాడ్సేనే... అమికస్ క్యూరీ

జాతిపిత మహాత్మా గాంధీని చంపింది ముమ్మాటికీ గాడ్సేనే అని.. అందువల్ల 60 యేళ్ల క్రితం జరిగిన ...