మొన్నటివరకూ రజినీకాంత్ వెనుకే... ఇప్పుడు గొయ్యి తవ్వుతున్నారా?

మంగళవారం, 2 జనవరి 2018 (10:10 IST)

rajinikanth

రజినీకాంత్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాలు బాగా వేడెక్కిపోయాయి. ముఖ్యంగా తన పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన తెలుపడంతో ఇప్పటికే పాతుకుపోయి వున్న రాజకీయ పార్టీలు నొసలు ఎగురవేశాయి. ఇదిలావుంటే రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఆయన్ని హీరోగా పెట్టి చిత్రాలు చేసిన దర్శకులు కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం పైన తమిళుడు మాత్రమే కూచుంటాడని గట్టిగా వాదిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ఆర్ ప్రభాకరన్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ... రజినీకాంత్‌కు తను ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసేది లేదని తేల్చి చెప్పారు. తను ఓ తమిళుడికి మాత్రమే ఓటు వేస్తానని వెల్లడించారు. 
 
ఐతే తను రజినీకాంత్‌కు పెద్ద అభిమానిననీ, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంతేనని పేర్కొన్నారు. ఓ నటుడిగా తను రజినీకాంత్‌ను ఎంతగానో ఆదరిస్తాననీ, కానీ రాజకీయాల్లో మాత్రం పూర్తిగా తిరస్కరిస్తానని వెల్లడించారు. కాగా మరికొందరు తమిళ దర్శకులు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేయడం గమనార్హం. మరి వీరికి రజినీకాంత్ ఎలాంటి సమాధానం చెపుతారో చూడాల్సి వుంది.దీనిపై మరింత చదవండి :  
Rajinikanth Politics Tamilian Tamil Nadu Tn Politics

Loading comments ...

తెలుగు వార్తలు

news

24 గంటల ఉచిత విద్యుత్‌ను ఓ కేస్‌స్టడీగా తీసుకోవాలి : పవన్ కళ్యాణ్

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ...

news

హఫీజ్ సయ్యీద్‌కు షాక్: పాకిస్థాన్‌ ఏం చేసిందో తెలుసా?

ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయ్యీద్‌కు పాకిస్థాన్‌ చుక్కలు చూపించేందుకు ...

news

కేసీఆర్ సాబ్.. అంత పెద్ద టాస్క్ ఎలా సాధ్యమైంది? : జనసేనాని ప్రశ్న

రాష్ట్రంలోని రైతాంగాన్ని అదుకునేందుకు వీలుగా జనవరి ఒకటో తేదీ నుంచి 24 గంటల పాటు ఉచిత ...

news

బ్రెడ్ అంటేనే మనకు మనసు డెడ్.. చింతకాయ పచ్చడిని: వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాక్చాతుర్యం కలిగిన వారు. వేదికపై ఆయన ప్రసంగం చేస్తే.. అందరూ ...