శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (10:14 IST)

రండి.. చేతులు కలపండి... రజనీ పిలుపు : వెబ్‌సైట్ లాంచ్

తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసి 24 గంటలు గడవకముందే తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ క్షేత్రస్థాయి పనులను ప్రారంభించారు. ఇందులోభాగంగా, ఓ వెబ్‌‌సైట్‌, యాప్‌ను ప్రారంభించి, వాటి ద్వారా తన అభిమానులకు, రాష్ట

తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసి 24 గంటలు గడవకముందే తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ క్షేత్రస్థాయి పనులను ప్రారంభించారు. ఇందులోభాగంగా, ఓ వెబ్‌‌సైట్‌, యాప్‌ను ప్రారంభించి, వాటి ద్వారా తన అభిమానులకు, రాష్ట్ర ప్రజానీకానికి ఓ పిలుపునిచ్చారు. 
 
మంచి మార్పు కోసం ఫ్యాన్స్‌, తమిళ ప్రజలు ఏకతాటిపైకి రావాలని. పార్టీలో వాలంటరీలుగా చేరాలని ఆయన పిలుపునిచ్చాడు. ఇందుకోసం రజనీమండ్రమ్‌ డాట్ ఓఆర్జీ ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అందులో రజనీ ప్రసంగం వీడియోను ఉంచారు. 
 
అందులో.. ‘నా రాజకీయ ప్రవేశాన్ని అభినందించిన అందరికీ మనసారా కృతజ్ఞతలు. నమోదయిన నా అభిమాన సంఘాలు, నమోదు చేయని అభిమాన సంఘాలను, రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాలని, మంచి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్న ప్రజలందరినీ ఏకతాటిపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నా. ఇందుకోసం ‘రజనీమండ్రం.ఓఆర్‌జీ’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించా. ఇందులో మీ పేరు, మీ ఓటరు గుర్తింపుకార్డు నెంబరును నమోదు చేసి సభ్యులుగా చేరొచ్చు’ అని పేర్కొన్నారు. 
 
ఆ వీడియో ప్రారంభంలో బాబా ముద్రకు ప్రాధాన్యమిచ్చారు. తొలి పది సెకన్లపాటు బాబా చిత్రంలో బాబాజీని చూపించేటప్పుడు వినిపించే సంగీతాన్నే  ఉపయోగించారు. రజనీకాంత్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు పలువురు అభిమానులు సోమవారం పోయెస్‌గార్డెన్‌లోని ఆయన నివాసానికి తరలివచ్చారు. రజనీకాంత్‌ వారి వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
 
అన్నీ బాగానే ఉన్నా పార్టీ పేరును ప్రకటించకుండానే ఈ హడావుడి చేస్తుండటం కొసమెరుపు. సుమంత్‌ రామన్‌ అనే రాజకీయ విశ్లేషకుడు రజనీ పొలిటికల్‌ ఎంట్రీని స్వాగతిస్తూ.. అవసరమైతే రజనీకి సలహాలు ఇస్తానని ముందుకు రావటం విశేషం.