శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (18:30 IST)

ఎలుకల మందును రుచిచూసిన ఫాస్టర్.... గాల్లో కలిసిన ప్రాణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎలుకలు మందును రుచిచూసిన ఓ ఫాస్టర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లాకు చెందిన రాబర్ట్ అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ చర్చిలో ఫాస్టర్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే, చర్చిలో ఎలకల బెడద ఎక్కువగా ఉండటంతో ఆహార పదార్థంలో ఎలుకల ముందు కలిపి చర్చిలో అక్కడక్కడా పెట్టాడు. కానీ, ఆ ఎలుకల మందు పని చేస్తుందో లేదనన్న సందేహంతో రుచి చూశాడు. 
 
అంతే... ఈ మందు ఘాటైన విషపదార్థం కావడంతో రాబర్ట్ ఆరోగ్యం కొద్దిసేపట్లోనే క్షీణించింది. దాంతో చర్చి సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.