శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (15:44 IST)

కృష్ణమ్మ మహాత్మ్యం: చిన్నారికి 3 చేతులు.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్.. కృష్ణమ్మ కథేంటో తెలుసా?

కృష్ణమ్మ పుష్కరాల్లో చివరి రోజు వింత చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌లోని సోమశిల పుష్కర ఘాట్ వద్ద ఓ చిన్నారికి మూడు చేతులు కనిపించాయి. తన తండ్రితో కలిసి ఓ చిన్నారి పుష్కర స్నానానికి వెళ్ళగా.. కొన్ని ఫోటోలు

కృష్ణమ్మ పుష్కరాల్లో చివరి రోజు వింత చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌లోని సోమశిల పుష్కర ఘాట్ వద్ద ఓ చిన్నారికి మూడు చేతులు కనిపించాయి. తన తండ్రితో కలిసి ఓ చిన్నారి పుష్కర స్నానానికి వెళ్ళగా.. కొన్ని ఫోటోలు దిగారు. వాటిల్లో ఒకదానిలో పాపకు మూడు చేతులున్నట్లు కనిపిస్తోంది. కృష్ణయ్య అనే యాత్రికుడు తన కుమార్తె, 11 నెలల ప్రయోగకు స్నానం చేయిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది.
 
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృష్ణమ్మ మహాత్మ్యం కారణంగానే ఇలా జరిగిందని భక్తులు చర్చించుకుంటుండగా.. ఈ ఫోటో తీసే సమయంలో ఫోటో బ్లర్ అయి వుండవచ్చునని కొందరు నెటిజన్లు అంటున్నారు. కానీ బ్లర్ అయితే.. మూడో చేయి అంత స్పష్టంగా ఎలా కనిపిస్తుందని మరికొందరు వాదనకు దిగుతున్నారు. అంతా కృష్ణమ్మ మహిమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 
కృష్ణమ్మ కథేంటో తెలుసా?
కృష్ణమ్మను భక్తితో స్మరించేవారు సంసారమాయను సులభంగా దాటగలరని స్కాంద పురాణం చెప్తోంది. తనను భక్తితో సేవించే వారి కష్టాలు పారద్రోలడానికి ఈ నది నిత్యం ప్రవహిస్తూ జీవనది అయింది. భక్తితో కృష్ణాజలాలను సేవించేవారి హృదయాలలో విష్ణుమూర్తి నివసించి, సంసార భయం పోగొట్టి, జ్ఞానం ప్రసాదిస్తాడు. కృష్ణునిచే సృష్టించబడిన ఈ తల్లి, సర్వపాపాలను తొలగించేది కనుక కృష్ణ అనే పేరు సార్థకమైంది.
 
విష్ణుమూర్తి అనుజ్ఞ ప్రకారం కృష్ణమ్మను బ్రహ్మదేవుడు తన కుమార్తెగా చేసుకుంటాడు. సకల పాపాలను తొలగించే కృష్ణమ్మ పవిత్రగాథను కుమారస్వామికి శివుడు వివరించగా, ఆ గాథను నారదుడు వివరించాడు. శివుని దర్శనం కోసం ఓ రోజు కుమారస్వామి కైలాసానికి వచ్చి.. తండ్రిని నమస్కరించి.. మీ విభూతి రేఖలే కదా పుణ్యనదులన్నీ.. కృష్ణవేణి మహాత్మ్యం వినాలని ఉంది.. చెప్పమన్నాడు. 
 
బ్రహ్మలోకం నుండి కృష్ణవేణి భూమికి ఎలా వచ్చింది..?
కృతయుగంలో కృష్ణవేణి దేవతల చేత, మహర్షుల చేత సేవించబడుతూ, పుణ్యమూర్తిగా విరాజిల్లుతోంది. ప్రజలంతా ఉత్తమ, అధమ తేడా లేకుండా కాలం గడుపుతున్నారు. అయితే కాలక్రమేణా వారిలో కలహాలు మొదలయ్యాయి. ఆనందం, సంతోషం కనుమరుగైంది. పాపం పెరిగిపోయింది. ప్రజానాశనం జరగటం చూసి కృష్ణునితో పాపవిముక్తి కోసం కృష్ణవేణినదిని సృష్టించారు. అయితే అది బ్రహ్మలోకంలో ఉంది. ప్రజల పాపాలను హరించేందుకు శ్రీకృష్ణుడు కృష్ణవేణిని భూలోకానికి పంపిస్తాడు. అదే ప్రస్తుతం కృష్ణానదిగా రూపం దాల్చింది. 
 
భూమిపై గల ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకే శ్రీకృష్ణుడు ఈ తీర్థాన్ని పంపినట్లు పురాణాలు చెప్తున్నాయి.  అలాగే సహ్యాద్రిని అనే మహర్షి తపస్సు మేరకే కృష్ణమ్మ అవతరించిందని కూడా పురాణాలు చెప్తున్నాయి. కృష్ణమ్మ తల్లి ప్రభావంతో స్వర్గం విశాలమైపోయింది. నరకం కుంచించుకుపోయిందని ఋషులు, దేవతలు ప్రశంసించారు. అలా కృష్ణమ్మ భూమిమీదకు వచ్చి భక్తులను అనుగ్రహిస్తోంది. అలాంటి అనుగ్రహంలో ఒకటే చిన్నారిని మూడు చేతులతో ఉన్నట్లు కనిపించేలా చేసిందని భక్తులు నమ్ముతున్నారు.