శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (11:58 IST)

మైట్రో రైలు సమస్యలు త్వరలో సర్దుకుంటాయి: కేటీఆర్

మెట్రో రైలు నిర్మాణం విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ త్వరలో సర్దుకుంటాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. అసెంబ్లీ, మొజంజాహీ మార్కెట్ వద్ద మెట్రో రైలు భూగర్భ రైలు ఉంటుందని కేటీఆర్ అన్నారు. మెట్రో కవర్ గానీ ప్రాంతాల్లో బీఆర్డీఎస్, ఎల్ఆర్టీఎస్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
 
మెట్రో రైలును కేవలం 72 కిలోమీటర్లకే పరిమితం చేయమని చెప్పారు. 2040 కల్లా 250 కిలోమీటర్ల మేర విస్తరిస్తామని తెలిపారు. మరోవైపు, మెట్రో రైలు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 4,600 కోట్లు ఖర్చయిందని హెచ్ఎంఆర్ డైరెక్టర్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. మెట్రో రైలు పనులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు.
 
చారిత్రక ప్రదేశాలు ఉన్నచోట భూగర్భ రైలు లేదా ప్రత్యామ్నాయం ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వం సూచలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మెట్రో ట్రయల్ రన్ ఉంటుందన్నారు. ఉగాది రోజున నాగోల్ - మెట్టుగూడ మధ్య సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.