శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (20:29 IST)

సచివాలయంలో కొలువుదీరిన మట్టి గణపతి...

అమరావతి : భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండగుల వెనుకున్న పరామర్థం కూడా అదేనని భావిస్తూ... ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహారశాల అసోసియేషన్ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది.

అమరావతి : భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండగుల వెనుకున్న పరామర్థం కూడా అదేనని భావిస్తూ... ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహారశాల అసోసియేషన్ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. సచివాలయంలోని మూడో బ్లాక్ క్యాంటీన్లో వినాయక చవితి వేడుకలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
 
అయిదు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టించి, శాస్త్రోక్తంగా భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహార శాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకలు ఈ నెల 19వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు వంకాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కేవీఎల్ కాళీకుమార్, ట్రెజరర్ కొండారెడ్డి, ప్రతాప్ రెడ్డి, వరాలు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.