గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 25 జనవరి 2018 (16:47 IST)

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘన విజయం: శైలజానాథ్ - ఫక్కున నవ్విన శ్రీవారి భక్తులు

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొ

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొందడం ఖాయమని శైలజానాథ్ అన్నారు. 
 
శైలజానాథ్ ఇలా చెబుతుండగా పక్కనే ఉన్న కొంతమంది భక్తులు పకపకా నవ్వుతూ కనిపించారు. దీంతో శైలజానాథ్ మాత్రం వాటిని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ప్రజలకు బాగా అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు శైలజానాథ్.