Widgets Magazine

గవర్నర్‌కు తెరాస సభ్యత్వం ఇవ్వొచ్చు.. నరసింహన్‌కు భజన శాఖ కేటాయించండి

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్‌కు రాజకీయాలపై ఆసక

jeevan reddy
pnr| Last Updated: ఆదివారం, 21 జనవరి 2018 (16:08 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉంటే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరవచ్చన్నారు.

నరసింహన్‌ వ్యాఖ్యలు గవర్నర్‌ హోదాకు తగదన్నారు. కేసీఆర్‌కు కితాబు ఇవ్వడానికే గవర్నర్‌ కాళేశ్వరం పర్యటన అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్‌ హయాంలోనే ప్రాణహిత - చేవెళ్లకు అంకురార్పణ జరిగిందని, గవర్నర్‌ ప్రాజెక్టు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని అన్నారు.

అలాగే, మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, గవర్నర్‌ ప్రభుత్వ పథకాలు మెచ్చుకుంటే ఫరవాలేదు గానీ.. సీఎంను కాళేశ్వర చంద్రశేఖర్‌ రావుగా సంభోదించడమేంటిని నిలదీశారు. తెరాస ప్రభుత్వం వీలుంటే నరసింహన్‌కు 'భజన శాఖ' కేటాయించాలన్నారు.

తెలంగాణ ప్రజలు గవర్నర్‌ నరసింహన్‌ను కల్వకుంట్ల నరసింహన్‌ రావు అని అనుకుంటున్నారన్నారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించిన రోజే రాజ్‌భవన్ ప్రతిష్ట మంటగలిసిందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.


దీనిపై మరింత చదవండి :