శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (13:39 IST)

సూరి హత్య కేసు ఏమౌతుంది..? బెయిల్ కోసం దరఖాస్తు.. రూ.200 కోట్ల రాజీ కుదిరిందా?

ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం ఎమ్మెల

ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరి దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. సూరి హత్య జరిగి ఐదేళ్లు (2011) కావస్తోంది. భానుకిరణ్ సూరి హత్యలో ప్రధాన నిందితుడు.
 
తన భర్త హత్యతో వంశీకి ప్రమేయం ఉందంటూ సూరి భార్య గంగుల భానుమతి గతంలో తీవ్ర ఆరోపణలు చేయడంతో కోర్టు వంశీకి సమన్లు పంపింది. గతంలో రాంగోపాల్ వర్మ ఇదే ఇతివృత్తపు నేపథ్యంలో 'రక్తచరిత్ర' సినిమా నిర్మించారు. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సూరి భార్య భానుమతి- భాను కిరణ్‌ల మధ్య 200కోట్లతో రాజీ కుదర్చడానికి చర్చలు జరుగుతున్నట్లు 2015లోనే ఒక ఇంగ్లీష్ దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.
 
భానుకిరణ్ తరపున కొంతమంది మధ్యవర్తులు సూరి భార్యతో సంప్రదింపులు జరిపారని సదరు వార్తా కథన సారాంశం. ఇదిలావుండగా భానుకిరణ్ శత్రువులనుంచి ప్రమాదం వుందంటూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.