శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 29 జులై 2016 (17:52 IST)

కేసీఆర్ హ‌రిత హారం - చంద్ర‌బాబు వ‌నం మ‌నం...

విజ‌య‌వాడ‌: ఏపీలో వాడవాడ‌లా వ‌నం మ‌నం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. తెలంగాణాలో కేసీఆర్ హ‌రితహారం పెట్టి... రాష్ట్రం అంత‌టా మొక్క‌లు నాటించారు. ఇపుడు దానికి ధీటుగా ఏపీలో చంద్ర‌బాబు వ‌నం మ‌నం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. హ‌రితాంధ్రప్రద

విజ‌య‌వాడ‌: ఏపీలో వాడవాడ‌లా వ‌నం మ‌నం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. తెలంగాణాలో కేసీఆర్ హ‌రితహారం పెట్టి... రాష్ట్రం అంత‌టా మొక్క‌లు నాటించారు. ఇపుడు దానికి ధీటుగా ఏపీలో చంద్ర‌బాబు వ‌నం మ‌నం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. హ‌రితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన వనం- మనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు విద్యార్థులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు. పలు జిల్లాల‌లో వనం-మనం ర్యాలీలను ప్రారంభించారు. ఈ ఒక్క రోజే కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
 
* నెల్లూరు: గాంధీబొమ్మ సెంటర్‌ నుంచి వీఆర్సీ సెంటర్‌ వరకు వనం మనం ర్యాలీని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
 
* కడప: రాజంపేటలో వనం-మనం ర్యాలీలో ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి, టీడీపీ నేత సాయిప్రతాప్‌, అధికారులు పాల్గొన్నారు.
 
* పశ్చిమ‌.గోదావ‌రి: ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు.
 
* ద్వారకాతిరుమల దేవస్థానంలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఈవో వేండ్ర త్రినాథరావు మొక్కలు నాటారు. 
 
* ఏలూరులో వనం-మనం ర్యాలీని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ఈ ర్యాలో పాల్గొన్నారు 
 
* తిరుపతి: నగర పాలకసంస్థ ఆధ్వర్యంలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో వనం-మనం కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి బొజ్జల, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
* అనంతపురం: బత్తలపల్లి మండలం తాటిమయ్యకొండ దగ్గర వనం-మనంను నిర్వహించారు. రెండు వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొన్నారు.
 
* పెనుకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజిలో నిర్వహించిన వనం-మనంలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి పాల్గొన్నారు.
 
* విశాఖ: పాడేరులో వనం- మనం కార్యక్రమంలో డీఎఫ్‌వో పాల్గొని మొక్కలు నాటారు.
 
* విశాఖ కంభాలకొండఅటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర,కలెక్టర్‌ ప్రవీణ్‌, అధికారులు పాల్గొన్నారు.
 
* గాజువాకలో నిర్వహించిన వనం-మనంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మొక్కలు నాటారు. అటు పెదకదిరి పాఠశాలలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మొక్కలు నాటారు.
 
* వనం-మనం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మొక్కలు నాటారు. 
 
* తూ.గో: తునిలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా మంత్రి యనమల రామకృష్ణుడు మొక్కలు నాటారు.
 
* శ్రీకాకుళం: కోటబొమ్మాళి మార్కెట్‌యార్డులో నిర్వహించిన వనం-మనంలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్, ఎస్పీపాల్గొన్నారు.
 
* విజయవాడ: నగరంలో సిద్ధార్థ విద్యాసంస్థల్లో 5 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షుడు కొడాలి సుభాష్ చంద్రబోస్‌ ప్రారంభించారు.
 
* రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత గారు ఔష‌ధ‌, రావి, వేప మొక్క‌ల‌ను నాటారు. ఏపీలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 21 పెట్రోల్ బంక్ లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రెండు బంకులు నడుస్తున్నాయని, వాటిని విస్తరిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో పెట్రోల్ బంకు ఏర్పాటుకు నిన్న ఆమె శంకుస్థాపన చేశారు.
 
* విజయవాడ టిడిపి కార్యాలయం లో వనం - మనం కార్యక్రమం.కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి ఉమా. పాల్గొన్న పార్టీ నేతలు చౌదరి,కుమార్,నాని రాజేష్.సురేశ్ నాటారు
 
*  చిలకాలురిపేట & గుంటూరు.  విజయవాడ గుడివాడలో ‘వనం-మనం’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం వ్య‌వ‌సాయ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్రారంభించారు
 
* గుంటూరు నగరము లోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలోఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నాగవేని.పాల్గొని మొక్కలు నాటారు.
 
* తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తిలక్ వీధిలో హోం మంత్రి చినరాజప్ప వనం-మనం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.
 
* గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం నల్లపాడు రిజర్వ్‌ ఫారెస్టులో ‘వనం-మనం’ కార్యక్రమాన్నిమంత్రి రావెల కిశోర్‌బాబు ప్రారంభించారు. జిల్లాల్లో 16.50 లక్షల మొక్కలు నాటేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది.
 
* విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ‘వనం-మనం’ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.