శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:07 IST)

ముగిసిన మల్లి మస్తాన్ బాబు అంత్యక్రియలు.. వెంకయ్య హాజరు...

భారత పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌ బాబు అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మల్లిమస్తాన్‌ బాబును కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. వీరిలో కేంద్ర మంత్రి కేంద్రమంత్రి వెంకయ్య, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ రెడ్డి, రావెల కిషోర్‌, పి.నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిలు మల్లి మస్తాన్ బాబు భౌతికకాయానికి నివాళులర్పించారు. 
 
అంతకుముందు మస్తాన్ బాబు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. మస్తాన్ బాబు అమర్‌ రహే అంటూ అంతిమయాత్రలో పాల్గొన్న హితులు, స్నేహితులు, బంధువులు నినాదాలు చేశారు. అనంతరం గాంధీజనసంగంలోని అతని పొలంలోనే.... సాహసవీరుడు శాశ్వాత నిద్ర తీసుకున్నాడు. అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు.