కుటుంబ కలహాలే కొంపముంచాయి.. భార్య ఆత్మహత్య.. ఆమె లేదని భర్త కూడా?
గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:45 IST)
కుటుంబ కలహాలే ఆ వివాహిత కొంపముంచాయి. పెళ్లైన ఏడాదికే ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె లేని శోకాన్ని దిగమింగుకోలేక భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చేవెళ్లలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు(23)కు గత ఏడాది వివాహమైంది.
అయితే భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలతో ఆంజనేయులు భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణించడంతో ఆంజనేయులు తన తల్లి చంద్రమ్మతో కలిసి చేవెళ్ల హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. తాపీమేస్త్రీగా పనులు చేసుకుంటున్నాడు.
కానీ బుధవారం చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. స్థానికుల సాయంతో ఆంజనేయులు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ లభించిందని, భార్య లేదనే మనస్తాపంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,
,
,
,