శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (09:57 IST)

దళితులు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు: ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మంత్రి భూమా అఖిలప్రియ వస్త్రధారణపై విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆది నారాయణరెడ్డి మండిప‌డ్డారు. రోజాలాంటి వారు వస్త్రధారణపై మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని.

టీడీపీ మంత్రి భూమా అఖిలప్రియ వస్త్రధారణపై విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆది నారాయణరెడ్డి మండిప‌డ్డారు. రోజాలాంటి వారు వస్త్రధారణపై మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని... బట్టలు లేకుండా తిరిగే వాళ్లకు వస్త్రధారణపై మాట్లాడే అర్హత లేదని సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆది నారాయణ రెడ్డి దళితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దళితులు శుభ్రంగా ఉండరు.. సక్రమంగా చదువుకోరు.. వారు అభివృద్ధి చెందక పోవడానికి వారే కారణమంటూ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కామెంట్లు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రి అభివృద్ధి అంశంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దళితులు మారలేదన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్‌ దళితులకు పదేళ్లు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పటికి 70 ఏళ్లు దాటినా వారిలో ఎటువంటి మార్పు రాలేదని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.
 
దళితులు అభివృద్ధి చెందకపోవడానికి దళితులే కారణమని.. వారి భూములకు పట్టాలుండవు. వారు బాగు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు. అందుకే వారే ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారని దళితులను కించపరిచారు. ఆదినారాయణ చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి.