శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (18:38 IST)

కోటయ్య కమిటీ నివేదిక ప్రకారం రుణమాఫీ: ప్రత్తిపాటి

ఆర్‌బీఐ నుంచి రీషెడ్యూల్ లేఖ రాగానే కోటయ్య కమిటీ నివేదిక ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కోటయ్య కమిటీ నిబంధనల మేరకు రుణమాఫీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని, రుణమాఫీ చేయట్లేదని ఎక్కడా చెప్పలేదన్నారు. 
 
తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉన్నందునే రుణమాఫీ అంటున్నారని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. ఏపీకి లోటు బడ్జెట్‌ ఉందని, ఒక సంవత్సరం మారటోరియం, రెండు సంవత్సరాలు రీషెడ్యూల్ చేస్తారన్నారు. కాగా, రైతు రుణమాఫీల విషయంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వైఖరిపై రైతుల్లో అసంతృప్తి ఏర్పడింది. మరి లోటు బడ్జెట్ ముసుగులో ఏపీ సర్కారు ఏ మేరకు రుణ మాఫీలు చేస్తుందో వేచి చూడాలి.