సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (12:05 IST)

బంధువే రాబందువు... బాలికపై నాలుగేళ్లుగా రేప్.. వీడియో తీసి స్నేహితులకు షేర్

ఓ బాలిక పాలిట బంధువే రాబందువయ్యాడు. అన్నెంపుణ్యం తెలియని ఓ బాలికను చెరబట్టిమరీ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. అంతేనా, అత్యాచారాన్ని వీడియో తీసి తన స్నేహితులకు కూడా షేర్ చేశాడు. దాన్ని బూచిగా చూపి గత నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. హైదరాబాద్ కామాటిపురలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కామాటిపురకు చెందిన ఓ వ్యక్తి ఆయిల్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయనకు భార్యా, ఓ కుమార్తె ఉంది. పొట్టకూటి కోసం భార్యాభర్తలు పనులకు వెళితే, బాలిక ఒక్కటే ఇంట్లో ఉండేది. దీన్ని గమనించిన సమీప బంధువు రాజేశ్ (25) ఆ బాలికను చెరబట్టాడు. ఆ తర్వాత ఆ బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను చూపిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అంతటితో ఆగని ఆ కామాంధుడు ఆ వీడియోను తన స్నేహితులకు చేరవేశాడు. అలా ఈ వీడియో పలువురుకి షేర్ అయింది. ఈ విషయాన్ని ఆ బాలికకు చెందిన రాజేశ్ స్నేహితులు అభిజిత్ కౌశిక్, శుభమ్ వ్యాస్‌లతో పాటు మొత్తం 8 మంది ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఆ బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... డిసెంబరు 31వ తేదీన రాజేశ్‌తో పాటు ముగ్గురుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.