ప్రజారాజ్యమే తమ్ముడు కొంపముంచేసింది.. జనసేన ఓటమిపై రోజా

pawan kalyan
Last Updated: శుక్రవారం, 14 జూన్ 2019 (16:02 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంపై వైకాపా ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓడిపోయేందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీనేనని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఇంటర్వ్యూలో రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.  
 
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు గెలుచుకున్నా.. పార్టీని చిరంజీవి నిలుపుకోలేకపోయారు. ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటు వేస్తే పార్టీ విలీనం చేసి చిరంజీవి పెద్ద తప్పు చేశారని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ పెట్టిన జనసేనపై పడిందని అందుకే పవన్ ఘొర ఓటమి పాలయ్యారని రోజా అభిప్రాయపడ్డారు. 
 
అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన మాత్రం ఎన్నికలలో బాగా పోటీ ఇచ్చిందని, విజయం కోసం జనసేనాని బాగా ప్రయత్నించారని రోజా కితాబిచ్చారు. అంతేకాదు తన ఓటమికి కూడా ఎంతోమంది అడ్డుపడ్డారని అయినా కూడా ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని రోజా చెప్పుకొచ్చారు.దీనిపై మరింత చదవండి :