ముద్రగడ పిచ్చోడు, నమ్మొద్దు - బాబు,పీకే కలిస్తే లాభం.... కాపు కార్పొరేషన్ ఛైర్మన్
బుధవారం, 12 జులై 2017 (15:47 IST)
ముద్రగడ పద్మనాభం ఒక పిచ్చోడని, ఆయన మాటలను కాపులు నమ్మొద్దన్నారు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామాంజనేయులు. ముద్రగడ పద్మనాభం వల్ల కాపులకు నష్టమే తప్ప లాభం మాత్రం లేదన్నారు. ఈ నెల 26న ముద్రగడ తల పెట్టిన పాదయాత్రను మానుకుంటే బాగుంటుందన్నారాయన.
ముద్రగడ పోరాటం చేస్తేనే కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పందిస్తోందనడంలో ఎంతమాత్రం నిజం లేదని, త్వరలోనే చట్టబద్దత కలిగిన కాపు రిజర్వేషన్లు వచ్చి తీరుతాయన్నారాయన. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తేనే మంచిదంటున్నారాయన. కాపు కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారందరికీ త్వరలోనే పూర్తిస్థాయిలో రుణాలు అందుతాయని చెప్పారు రామాంజనేయులు.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,
,
,
,