శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (12:09 IST)

తుని ఘటనలో కుట్రదారుడిగా ముద్రగడ.. ఆర్పీఎఫ్ పోలీసుల అదుపులో...

తుని ఘటన కేసులో కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరును పోలీసులు చేరారు. దీంతో విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ హోటల్‌లో ఉన్న ఆయనను ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని అనకాపల్లి ర

తుని ఘటన కేసులో కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరును పోలీసులు చేరారు. దీంతో విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ హోటల్‌లో ఉన్న ఆయనను ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని అనకాపల్లి రైల్వేపోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ ముద్రగడ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. 
 
కాపు రిజర్వేషన్ల కోసం తునిలో నిర్వహించిన బహిరంగ సభ ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి చేశారు. ఈ దాడి కేసులో ముద్రగడను కుట్రదారుడిగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.
 
తుని ఘటన నిందితులు ఆకుల రామకృష్ణ, చెల్లా ప్రభాకర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ముద్రగడను అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. కొందరు అనుచరులను విచారణకు పిలవగా వారితో పాటు ముద్రగడ స్టేషన్‌కు వచ్చారని రైల్వే డీఎస్పీ తెలిపారు.