శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (18:16 IST)

శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు!

హైదరాబాద్‌లోని శంషాబాద్ డొమెస్టిక్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టియ్ టెర్మినల్‌ను ఎన్టీఆర్ డొమెస్టిక్ టెర్మినల్‌గా పిలవనున్నారు. 
 
వాస్తవానికి బేగంపేటలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరే ఉండేది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అభ్యంతరం చెప్పడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా నిర్ణయించారు. తాజాగా డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ టెర్మినల్ గా ఖరారు చేశారు.