Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

2 నెలలుగా బాలికలపై అత్యాచారం.. చాక్లెట్ ఆశ చూపి.. లైంగిక వేధింపులు..

బుధవారం, 11 జనవరి 2017 (19:41 IST)

Widgets Magazine

బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. నందకుమార్‌ అనే వ్యక్తి ఆరుగురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా చిన్నారులపై అత్యాచారానికి పాల్పిడినట్లు తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన టీచర్లు.. విద్యార్థినుల తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు నందకుమార్‌ను చితకబాదారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థినులు గిరకబావిగూడెం సుందరయ్య కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.
 
ఇదేవిధంగా ట్యూషన్‌కు వెళుతున్న ముగ్గురు చిన్నారులకు చాక్లెట్ ఆశచూపి ఓ వ్యక్తి అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.  మదనాపురం మండలంలోని గోవిందహళ్లి గ్రామానికి చెందిన 8 సంవత్సరాల ఇద్దరు బాలికలపై అదే గ్రామానికి చెందిన దాసరి శేఖర్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. రెండురోజులుగా ఆ ఇద్దరు చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో వారి తల్లిదండ్రులు ఎందుకు వెళ్లరంటూ ఆరా తీశారు. దీంతో జరిగిన సంఘటన ఆ తల్లిదండ్రులకు వివరించారు.
 
అదే గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న బాలుడినికూడా లైంగికంగా వేధించినట్లు తెలిసింది. ఈ ముగ్గురు చిన్నారులు ట్యూషన్‌కు వెడుతుండగా వారికి చాకెట్ల ఆశచూపి ఇంట్లోకి పిలిచిన శేఖర్ ఆ తరువాత అత్యాచారానికి పాల్పడిననట్లు డిఎస్‌పి చెన్నయ్య వివరించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు శేఖర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిరంజీవితో ఇంటర్వ్యూ: రోజాను పార్టీకి-ఛానెల్‌కి వాడుకున్న జగన్.. రేటింగ్ పెరిగిందా?

మెగాస్టార్ చిరంజీవితో సీనియర్ హీరోయిన్ రోజా ఇంటర్వ్యూ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ ...

news

జగన్‌ను ఇక శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డిగారు అని పిలుస్తా.. నేను బూట్లు నాకేవాడినా?: జేసీ

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికి పని చెప్పారు. వైకాపా నేతలపై జేసీ నిప్పులు చెరిగారు. ...

news

జవాన్లకు అందాల్సిన పదార్థాలు నల్ల బజార్లోకి అమ్మేస్తున్న బీఎస్ఎఫ్.. కందిపప్పు, కూరలు?

భారతదేశ సరిహద్దుల్లో మొదటి రక్షణ వలయమైన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) ...

news

సినిమా థియేటర్‌లో జాతీయ గీతాలాపన.. లేచి నిలబడని వ్యక్తులపై దాడి.. ఎక్కడ?

సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ ...

Widgets Magazine