Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లోకేష్‌ ఇక కుప్పం నీదే... చంద్రబాబు

ఆదివారం, 2 జులై 2017 (12:06 IST)

Widgets Magazine
chandrababu

తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం నియోజవర్గం. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో చంద్రబాబు గెలుస్తూనే వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కుప్పం నియోజకవర్గమే ప్రధాన కారణం. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబునాయుడు ఇక్కడి నుంచే గెలుపొందాడు. కుప్పం ప్రజలకు బాబు అంటే చాలా ఇష్టం. ఆయన నియోజవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంకా ఇష్టం. అందుకే చంద్రబాబుకు ఎప్పుడు ఎన్నికల జరిగినా కుప్పం నుంచి భారీ మెజారిటీతోనే గెలుస్తుంటారు. అయితే ఈసారి ఆ ఛాన్సును తన కుమారుడు నారాలోకేష్‌ కు ఇవ్వనున్నారట బాబు. ఇప్పటికే ఒక ఆ నిర్ణయాన్ని లోకేష్ కూడా చెప్పారట బాబు. ఇక నుంచి కుప్పం నియోజవర్గంలో అభివృద్థి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్థ పెట్టాలని సూచించారట.
 
ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని లోకేష్‌ ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేయాలన్నది ఆయన ఆలోచన. అందుకే బాబు ఈ నిర్ణయం తీసేసుకున్నారట. కుప్పంలో అయితే నారా లోకేష్‌ విజయం సులువు అవుతుందని బాబు ఆలోచన. నారా కుటుంబంలో ఎవరైనా సరే ఆదరించేందుకు కుప్పం ప్రజలకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నారా లోకేష్‌‌కు కుప్పం ఒక్కటే సరైన ప్రాంతమని నారా కుటుంబం మొత్తం ఒక నిర్ణయానికే వచ్చేసిందట. అయితే లోకేష్‌ కుప్పం నుంచి పోటీ చేస్తే చంద్రబాబునాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అంతర్జాతీయ ఉగ్రవాదికి అత్యంత భారీ భద్రత కల్పించిన పాకిస్థాన్

పాకిస్థాన్ కేంద్రంగా చేసిన భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న ...

news

ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడిని చంపేసిన అక్క... ఎక్కడ?

ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడిని అక్క చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను ...

news

సిగరెట్‌ కాల్చొద్దన్నాడని దివ్యాంగుడిని రైల్లోంచి తోసేశారు...

పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢ్‌లో ఓ దారుణం జరిగింది. కదులుతున్న రైలులో సిగరెట్ ...

news

ఆ దాడిని అవమానకరంగా భావించా.. అందే సర్జికల్ స్ట్రైక్స్ : మనోహర్ పారీకర్

మణిపూర్‌లో నాగాలాండ్‌ ఉగ్రవాదులు భారత ఆర్మీ కాన్వాయ్‌ మీద దాడిచేసి 18 మంది సైనికులను ...

Widgets Magazine