మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 8 డిశెంబరు 2017 (13:26 IST)

జగన్ పైన పవన్ పంచ్.... పవన్‌కు నారా లోకేష్ ఝలక్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని సమస్యల గురించి ప్రస్తావించినా పెద్దగా చర్చకు రాలేదు కానీ ఆయన వారసత్వ రాజకీయాలు అనగానే చాలామందికి బాగా గుచ్చుకుంది. ఎందుకంటే... ఇపుడున్న రాజకీయ నాయకుల్లో చాలామంది వారివారి పిల్లల్ని రంగంలోకి దించేశారు. ఈ జాబితా చెప్పాలంట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని సమస్యల గురించి ప్రస్తావించినా పెద్దగా చర్చకు రాలేదు కానీ ఆయన వారసత్వ రాజకీయాలు అనగానే చాలామందికి బాగా గుచ్చుకుంది. ఎందుకంటే... ఇపుడున్న రాజకీయ నాయకుల్లో చాలామంది వారివారి పిల్లల్ని రంగంలోకి దించేశారు. ఈ జాబితా చెప్పాలంటే చాలానే వుందనుకోండి. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ వేశారు. ముఖ్యమంత్రి కుమారుడిని కాబట్టి తనకే మళ్లీ ముఖ్యమంత్రి పదవి రావాలని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. 
 
ఐతే దానిపై జగన్ మోహన్ రెడ్డి పెద్దగా స్పందించలేదు కానీ ఎమ్మెల్యే రోజా, ఇతర నాయకులు మాట్లాడారు. ఇక సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అయితే పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ చాలా పోస్టులు పడ్డాయి. తాజాగా ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కు ఝలక్ ఇచ్చేలా వున్నాయి. 
 
వారసత్వ రాజకీయాలకు గురించి లోకేష్ స్పందిస్తూ... వారసులుగా వచ్చినా సమర్థవంతంగా పనిచేయలేకపోతే రాజకీయాల్లో నిలబడలేరన్నారు. వారసులుగా అవకాశం వచ్చినమాట నిజమేనని ఆయన అంగీకరించారు. ఐతే ప్రజామోదం వుంటేనే రాణించగలరని చెప్పారు. మొత్తమ్మీద వారసత్వ రాజకీయాలపై నారా లోకేష్ పవర్ స్టార్‌కు ఝలక్ ఇచ్చేనట్లే కనబడుతోంది.