Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నారాయణ కళాశాలలో మరో విద్యార్థిని యవ్వన ఆత్మహత్య(వీడియో)

మంగళవారం, 4 జులై 2017 (15:30 IST)

Widgets Magazine
girl-suicide

కారణాలు ఏమయినప్పటికీ నారాయణ కళాశాలలో చదివే విద్యార్థుల్లో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని నారాయణ కళాశాల హాస్టల్‌లో యవ్వన అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళాశాలలోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
 
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యెం మండలానికి చెందిన యవ్వన తిరుపతి నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల క్రితం తన అన్నతో కలిసి సొంత ఊరికి వెళ్ళివచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ తమతో కలవకుండా ముభావంగా ఉండేదని యవ్వన స్నేహితులు చెబుతున్నారు. అయితే నిన్న రాత్రి స్టడీ అవర్‌లో యవ్వన స్నేహితులందరూ కళాశాల ఆవరణలో చదువుకుంటూ వుండగా యవ్వన తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని గోప్యంగా ఉంచిన నారాయణ కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని రుయా ఆసుపత్రి మార్చురికి పంపించేశారు. నారాయణ కళాశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీడియో చూడండి...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీర్ హెల్త్ డ్రింకా..? అమ్మాయిలను కూడా తాగమంటారా? ఎర్రచందనాన్ని అమ్మే హెరిటేజ్‌ను?: రోజా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ...

news

'అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం ఇప్పించా.. మరి నా సంగతేంటి' : సర్పంచ్‌ భర్తకు చెప్పుదెబ్బలు

ఓ గ్రామ సర్పంచ్‌కు చెప్పుదెబ్బలు పడ్డాయి. టీచర్ ఉద్యోగం ఇప్పించినందుకు బహుమతిగా తన కోర్కె ...

news

రామోజీరావు ఇంట పెళ్లి సందడి... తరలిరానున్న ప్రముఖులు...

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి సీహెచ్. రామోజీరావు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద ...

news

గుడ్ వర్క్‌కు దక్కిన రివార్డు... వెలుగునిచ్చే దీపానికి సొంతిల్లు ఉండదు ... బదిలీపై శ్రేష్టా ఠాకూర్

నిజాయితీగా విధులు నిర్వహించినందుకు డీఎస్పీ శ్రేష్టా ఠాకూర్ అధికారిణికి ఉత్తరప్రదేశ్ ...

Widgets Magazine